అవనిగడ్డపై రంకేసిన జనసేనాని..!
రాష్ట్రం నడిగడ్డ అవినిగడ్డపై జనాసేనాని నాలుగొవ విడత వారాహి యాత్ర ఫుల్ జోష్ తో ప్రారంభమైంది.

ఐదు రోజుల వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రంగా సాగనున్నది. ఇందులో భాగంగా మొదటి రోజు పవన్ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో రెచ్చపోయారు. జగన్ పై.., వైసీపీ పై విమర్శలు గుప్పిస్తూ.. అనేక సవాళ్లు విసిరారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకమీదట ఇంకో లెక్క అంటూ అందరి లెక్కలు తేల్చేందుకు వచ్చా అంటూ పంచ్ డైలాగ్స్ పేల్చారు పవన్. జగన్ అంటున్న కురుక్షేత్ర యుద్ధానికి తాను సిద్ధమేనని.. అయితే కౌరవులం మేం కాదని.. తాము పాండవులం అని పంచ్ లు విసిరారు. ఏపీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమని .. అది కూడా టీడీపీ- జనసేన ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకొచ్చిన పవన్.. జగన్ ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. అయితే ఈ సభలో బీజేపీ ప్రస్తావనకు పవన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. తన స్వేచ్ఛను.., సినిమాలను ఆపేసి.. హక్కులను కాలరాసినా..తానేమీ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయలేదని పవన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని జగన్ కలలు కంటున్నారని.., ఆయనకు వచ్చే సీట్లు కేవలం 15 మాత్రమే అని విమర్శించారు. జగన్ వద్దనున్న ఆర్ధిక బలం.. ప్రైవేటు సైన్యం లేవని.. కానీ వాటిని ఎలా ఎదుర్కొవాలో తన వద్ద తీరి ఉందని చెప్పారు. మరో వైపు రాష్ట్రంలో ఉపాధి లేక దాదాపు 3 లక్షల కుటుంబాలు వలస వెళ్లారని .. ఈ పాపం ఎవరిది..? అని పవన్ ప్రశ్నించారు.