ఆసియా కప్ ఫైనాల్లో అమితుమీ.. లంకలో రోహిత్ టీం..!

ఆసియా కప్ తుది అంకానికి చేరింది. సెప్టెంబరు 17, ఆదివారం శ్రీలంక లోని కొలంబియా ప్రేమదాస స్ట్రేడియంలో జరనున్న ఫైనల్లో ఇండియా.., శ్రీలంక టీంలు తలపడునున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీలంక టీం ఫుల్ జోస్ లో ఉంది. ఆసియా కప్ లో శ్రీలంకకు ఉన్న రికార్డే వేరు. ఇప్పటివరకు శ్రీలంక 12 సార్లు ఫైనల్ కు చెరింది. 7 సార్లు టైటిల్ విజేతగా నిలించింది. అలానే భారత్ కూడా 11 సార్లు ఫైనల్లోకి చేరితే.. 7 సార్లు టైటిల్ ను గెలిచింది.

ఈ సారి టీ- ఇండియాకు గట్టిపోటీ ఇచ్చేందుకు శ్రీలంక సిద్దమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్ లో టీ-ఇండియాతో మినహా అన్ని జట్టులపై ఆధిక్యం కబరిచి 4 విజయాలను జట్టు ఖాతాలో వేసుకుంది. సూపర్ -4 బెర్త్ కోసం లీగ్ దశలో బంగ్లాదేశ్, ఆఫ్గాన్ లపై పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే పీచ్ ఎలా ఉన్న లంక టీం ప్రత్యర్థులను చిత్తు చేసేలా వ్యూహాత్మకంగా గేమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సొంత గడ్డపై జరిగే ఆసియా కప్ ఫైనల్ టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు లంక టీం సంసిద్ధమౌతోంది.