ఈ సారి తగ్గేదేలే..! వైసీపీకీ బాలినేని అల్టిమేటం..!

ఒక రాజకీయ పార్టీలో సొంతవారే అసంతృప్తి వాదులుగా మారితే ఆ వ్యతిరేక రాగం ఆ పార్టీ శరాఘాతంలా మారతాయనడంతో సందేహం లేదు. అందుకు ఉదాహరణే వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి.  

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. సమీప బంధువు. అయినా జగన్ రెండుసారి మంత్రివర్గ విస్తరణలో పక్కన పెట్టి వేరొకరికి ఛాన్స్ ఇచ్చారు. ఆ నాటి నుంచి బాలినేని అలకపూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. నిశ్శబ్ధ యుద్ధానికి తెరతీశారు. అయితే మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో బాలినేని రాజకీయాలు దూకుడు స్వభావంతో కూడి ఉంటాయి. అవి ఆ ప్రాంత సీనియర్లుకు బొత్తిన నచ్చేవి కావు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవీ ఊడటంతో జగన్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని మార్క్ రాజకీయాలకు కేఆర్ఫ్. ఆయన ట్రాక్ రికార్డు ప్రజల్లో ఆయనకున్న ఇమేజే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కోసం2012 లో ఎమ్మెల్యే పదవీ వద్దు అని రాజీనామా కూడా చేశారు. బై పోల్ భారీ మేజారిటీ తో తిరిగి గెలిచి చరిత్ర సృష్టించారు. ఇంతటి రాజకీయ ఘన చరిత్ర ఉన్న  బాలినేనికి వైసీపీలో వరుస అవమానాలు తప్పడం లేదని విశ్లేషణలు లేకపోలేదు.

మంత్రి పదవీ పోయిన పర్వలేదు కానీ.. తన కేడర్ ను పార్టీలో చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు అని ప్రస్తుతం బాలినేని వైసీపీకి అల్టిమేటం జారీ చేశారు. ఆయన అనుచరులుగా ఉన్న భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ని వైసీపీ సస్పెండ్ చేసింది. వేర్వేరు కారణాలు చూపుతూ.. ఆ ఇద్దరిపై అధిష్టానం వేటు వేసింది. ఆ విషయం బాలినేనికి తెలియకుండానే జరిగిపోయింది. ఇదే ప్రస్తుతం ఒంగోలు గడ్డపై రాజకీయ చిచ్చుకు దారితీస్తోంది. తనకు తెలియకుండా నా అనుచరులను సస్పెండ్ చేయడం ఏమీటి..? అని బాలినేని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. 48 గంటల్లో సస్పెండ్ చేసిన తన అనుచరులను పార్టీలోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుంటే బాలినేని లెక్క వేరేలా ఉంటుందని హుకూంసైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.