ఏపీలో ఎంఐఎం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు తగ్గ స్కెచ్ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ పార్టీ అధినేత లీకులిస్తున్నారు.

ఏపీలో ఎంఐఎం పాగవేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు తగ్గ స్కెచ్ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ పార్టీ అధినేత లీకులిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగు దేశంలో కూడా చంద్రబాబు అరెస్ట్ రాజకీయం అంతరాన్ని ఏర్పర్చిందని భావిస్తున్న క్రమంలో ఎంఐఎం తన వ్యూహాన్ని ఏపీలో అప్లై చేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ అధినేత.., హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ శ్రేణులకు దిశ నిర్థేశం చేస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం కొనసాగుతోంది రాజకీయ అనిచ్ఛితి. అందుకు కారణంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడం.., రెండో ఆప్షన్ గా ఉన్న చంద్రబాబు జైల్లో ఉండటం. జగన్ ప్రజలు నమ్మడం లేదు.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తమ పార్టీ ఏపీలో పాగవేయొచ్చు అన్న భావనను క్లియర్ గా వ్యక్తం చేశారు అసదుద్దీన్. జైల్లో చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నారని.. ఆయన జైల్లో ఎందుకున్నారో అందరికీ తెలుసన్నారు. జగన్ ను నమ్మలేం అని .., ఆయనన్ను ఎప్పటికీ నమ్మకూడదని అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియా మొత్తం అసదుద్దీన్ కామెంట్సే చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా మన పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉందని.., అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నానని ఆయన చెప్పారు. అందరూ సమైఖ్యంగా పనిచేస్తే ఏపీలో కూడా పాగా వేయడం పెద్ద కష్టం ఏమీ కాదు అని ఆయన అన్నారు.

మొత్తంగా చంద్రబాబు జైలు జీవితం.. తెలుగుదేశంకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెడితే.. విపక్షాలు మాత్రం వరంలా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసదుద్దీన్ వ్యాఖ్యలను ఏపీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఖండించారు. ఆంధ్రలోని ముస్లీంలు ఇన్నీ రోజులకు గుర్తుకు వచ్చారా..? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు.