ఏపీలో బాంబులే కాదు.. ప్రభుత్వం సరాఫరా చేసే పాల ప్యాకెట్లు కూడా పేలుతుంటాయి. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అవకతవకలు బయటకొస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో అంగన్ వాడీలకు సరాఫరా చేసిన పాల ప్యాకేట్లు బెలూన్ లా ఉబ్బి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పాల ప్యాకెట్లు ఇలా ఉబ్బిరావడాన్ని గమనించిన స్థానికులు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో ఇదే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది.

గ్యాస్ బెలూన్ ఉబ్బి పగిలేందుకు సిద్ధంగా ఉన్న ఈ పాల ప్యాకెట్ల వీడియోను తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ భాగోతం ఇంకా వైరల్ గా మారింది. అయితే ప్రతి నెల అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్బిణీ మహిళలకు.., చిన్నారులకు వీటిని పంపిణీ చేస్తుంటారు. ప్రభుత్వం ప్రతినెల టెట్రా ప్యాకెట్లో వీటిని సరాఫరా చేస్తుండగా.. ఈ సారి సాధారణ పాల ప్యాకెట్లో వీటిని పంపిణీ చేయడంతో ఇలా అయ్యి ఉండవచ్చునని అందరూ అనుమానిస్తున్నారు.

ఇలా పాల ప్యాకెట్లు ఉబ్బిరావడంతో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని.., పిల్లలు తాగే పాలను సైతం కాలకూట విషం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొమ్ముకోసం ఇటువంటి నీచానికి దిగడం దారుణమని ధ్వజమెత్తారు. ఉబ్బి ఉన్న పాల ప్యాకెట్లును తన సోషల్ మీడియాకు ట్యాగ్ చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇప్పడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వార్త.