ఏపీ బోర్డర్ వద్ద అలజడి..! హై టెన్షన్..!

ఏపీ బోర్డర్ వద్ద ఆదివారం అలజడి నెలకొంది. హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా ఐటీ ఉద్యోగులు తరలివస్తున్నారు.

ఏపీ బోర్డర్ వద్ద శనివారం అర్థరాత్రి నుంచే అలజడి నెలకొంది. హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా ఐటీ ఉద్యోగులు ఏపీ వైపు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ ను గత వారం రోజులుగా హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు నిరసిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులయితే రోడ్డెక్కి నినదించారు. ఔటర్ రింగ్ రోడ్డులో కార్ల ర్యాలీ ప్రదర్శనతో హోరెత్తించా రు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారని.., వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయనను గత 15 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఈ క్రమంలో చంద్రబాబు కుటుంబం అంతా రాజమండ్రి క్యాప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. అయితే.., చంద్రబాబు కుటుంబానికి సంఘీబావం తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు కారు ర్యాలీకి పిలుపునిచ్చారు.  ఆదివారం పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి కార్లలో రాజమండ్రి వైపు తరలివచ్చారు. దాదాపు 1500 కార్లలలో ఐటీ ఉద్యోగులు వేల సంఖ్యలో రాజమండ్రికి బయలుదేరారు.  నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను పరామర్శించి.., వారి ధైర్యం చెప్పేందుకు వస్తున్న ఐటీ ఉద్యోగులను తెలంగాణ.., ఆంధ్ర బోర్డర్ల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ నుంచి వస్తున్న కార్లును ఏపీ పోలీసులు చెక్ చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే ఏపీలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. ర్యాలీలకు.., యాత్రలకు ఎటువంటి అనుమతి లేదని వారికి పోలీసులు చెప్పారు. ర్యాలీలు వంటవి ఎట్టి పరిస్ధితిలో అనుమంతించేది లేదని తెలియజేశార. వాహనాలను ఏపీలోకి అనుమతించకపోవడంపై ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మేము ఏమైన టెర్రరిస్టులమా..అంటూ నిలదీశారు. దీంతో గరికపాడు..,అనుమంచిపల్లి చెక్ పోస్టుల వద్ద హై టెన్షన్ నెలకొంది. ఈ హైడ్రామా నడుమ ఏపీ బోర్డర్ వద్ద వాహనాల ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.