ఏపీ సభపర్వం.. వాడీవేడిగా చర్చ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడి వేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్..మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష, అధికార పక్షాలు చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి వాడి వేడిగానే జరుగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి.  శాసన సభ వేదికగా వైసీపీ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తోంది. మరోవైపు  ప్రతిపక్ష టీడీపీ ఈ సభను చంద్రబాబు అరెస్ట్ అంశంతో స్తంభింపజేసేందుకు ప్రణాళికలు రూపందించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 మొదటి రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. అయితే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై ప్రశ్నోత్తరాలు అనంతరం స్వీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగే బీఎస్సీ సమావేశంలో నిర్ణయిస్తారు. శాసనసభలో అధికార పక్షం వైఎస్ఆర్సిపి నాలుగున్నర ఏళ్లలో కీలక రంగాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.., అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలపై సభలో ప్రధానంగా చర్చకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేసింది.

ఉద్యోగుల జిపిఎస్ బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్, ప్రైవేటు యూనివర్సిటీల సవరణ, కాంట్రాక్టు ఉద్యోగుల సవరణ, పిఒటి సట్ట సవరణ, దేవాదాయ చట్ట సవరణ, భూదాన్ గ్రామదాన్ బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలను రూపొందించనున్నది వైసీపీ ప్రభుత్వం.  వీటితోపాటు చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, రాజధాని అసైన్డ్ భూముల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాంలపై పూర్తి వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు అనంతరం అభివృద్ధి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే టీడీపీ పక్ష నేతలంతా తొలి క్షణం నుంచి రచ్చ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సభ ప్రారంభకాగానే చంద్రబాబు అరెస్ట్ పై.., పెడుతున్న అక్రమ కేసులపై నిరసించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఆ పార్టీ. అధికార ప్రతిపక్షాల ప్రత్యేక వ్యూహాలతో ఈ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.

శాసనసభ సమావేశాల నిర్వహణకు మరోవైపు పోలీసులు ప్రత్యేక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ బయట కూడా కట్టుదింటమైన బందోబస్తు కల్పించారు.