కవిత కల సాకారం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కల సాకారం కానున్నది. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఎమ్మెల్యే కల్వకుంట కవిత.. తండ్రి తగ్గ కుమార్తె. ఉద్యమాల్లో ఎదిగి.. ఉద్యమమే ఊపిరిగా సాగించిన పోరాటాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని నమ్మి ముందుకు నడుస్తున్నారు కవిత. అటువంటి కవిత మహిళా రిజర్వేషన్ పై గత తొమ్మిదేళ్ళుగా అనేక విధాలుగా పోరాటాలు చేస్తోంది. చట్ట సభల్లో  మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కవిత డిమాండ్. అయితే కవిత కలను నేడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం నెరవేర్చనున్నది.  ఈ రోజు ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో జరిగే సమావేశంలో మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కెబినెట్ ఆమోదించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ పార్టీలో రాజకీయాలకు అతీతంగా మద్దుతు తెలిపాయి.

ఈ నేపథ్యంలో కవిత కూడా ఈ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు పెడుతున్న నేపథ్యంలో కవిత ఇంటివద్ద సంబరాలు అంబరాన్ని తాకాయి. బాణా సంచ కాల్చి.. స్వీట్స్ పంచుకున్నారు.   అయితే మహిళా బిల్లుపై  విధి విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభలో 33 శాతం మహిళా రిజర్వేషన్.., ఓబీసీ రిజర్వేషన్లపై ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.

నేడు (మంగళవారం ) జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో సభ ముందుకు ఈ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పార్లమెంట్ లో అమోదం తెలపగానే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. అక్కడ ఈ బిల్లు పాస్ గానే రాష్ట్రపతి ఆమోదిస్తారు. అనంతరం దేశ వ్యాప్తంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ విధానం పురుడుపోసుకుంటుంది. అయితే నూతన పార్లమెంట్ భవనంలో చరిత్రలో నిలిచిపోయేలా తొలి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రులు.. బీజేపీ అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణ జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత మహిళా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష చేసిన విషయం తెలిసిందే.