కవిత మెడకు బిగుస్తున్న ఈ(మో)డీ ఉచ్చు..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఆరు నెలలు తరువాత ఢిల్లీ మద్యం కేసు ఫైల్ ను ఓపెన్ చేసింది ఈడీ.

కవితను ఢిల్లీలో విచారణకు హాజరుకావాలంటూ ఈ సమన్లు ద్వారా ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అసలు ఈ  కేసును తిరిగి మళ్లీ ఎందుకు రీ-ఓపెన్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ మొదలైంది.

ఏడాదిగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ స్తబ్ధుగా నడుస్తోంది. ఆ మధ్య ఈడీ మూడు రోజులు విచారణ పేరుతో హడావుడి చేస్తే కవిత.., అన్న కేటీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. అయితే.., అప్పటికే.. ఈ కేసుకు సంబంధించిన అందర్నీ అరెస్ట్ చేసింది ఈడీ.  ఆ సమయంలో కవిత మాత్రమే అరెస్ట్ నుంచి తప్పించుకుందని బీజేపీ..,కాంగ్రెస్ లు విమర్శలు గుప్పించారు. కనిమొలి మాదిరిగా జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని అప్పట్లో చర్చలు ఊపందుకున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న నిందుతులందరూ అప్రూవర్స్ మారారు. ఇక కవితక్క జైలుకే అని బీఆర్ఎస్ పార్టీలోనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఈ కేసులు కీలకంగా ఉన్న వ్యక్తి అరుణ పిళ్లై అప్రూవర్ గా మారి ఈడీకి ఆధారాలను ఇచ్చారన్న టాక్ కూడా నడుస్తోంది. దీంతో విచారణలో ఉన్న ఈ కేసులో కవితకు సమన్లు జారీ చేసింది ఈడీ అన్నది వాస్తవం. అయితే అదేమీ లేదు.. ఎన్నికలు వేళ.. ఈ డ్రామాలు మామూలే.. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోడీ నోటీసులని ఎద్దేవా చేశారు కవిత. గతంలో దాఖలు చేసిన పిటిషన్ లో ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ తాలూకు విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ పై కోర్టులో కవిత తరుఫున ప్రముఖ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినపిస్తున్నారని ఆమె వివరించారు.

దీనిపై తన లీగల్ టీం ను ఢిల్లీకి పంపినట్లు ఆమె మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా ఎన్నికల వేళ.. కవిత అరెస్ట్ తప్పదు అన్న చర్చలు ఊపందుకుంది. అయితే.., అరుణ పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితను అరెస్ట్ చేస్తారా..? లేక విచారణ పేరుతో మరో పదేళ్ళు కాలయాపన చేస్తారా..? అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు పిళ్లై తానేమీ అప్రూవర్ గా మారి.. ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదని చెప్పినట్లు వార్తలు కూడా సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. అరెస్టా..? బీజేపీ హై డ్రామా..? అన్నది తెలాల్సి ఉంది.