టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ కృతిశెట్టి పుట్టిన రోజు సందర్బంగా విషెస్ తెలపాలని తన సొంత సోషల్ మీడియాలో అందాల విందును అభిమానులకు పంచింది.

అందం.., అభినయంతో తెలుగు చిత్ర సీమలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సొట్ట బుగ్గల సుందరి కృతి శెట్టి. అతి తక్కువ కాలంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ జాబితాలో కృతి స్థానం సంపాదించుకున్నారు. వరస అవకాశాలను అందిపుచ్చుకొని తక్కువకాలలో ఎంతో పేరు తెచ్చుకున్నారు.

కృతి శెట్టి తొలి చిత్రంతో కుర్ర కారును ఊపేసింది. వైష్ణవ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాలో బేబమ్మగా పరిచయమై తెలుగు నాట చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగారు రాజు చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, వారియర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డీలపడ్డాయి. అయితే తాజాగా శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న చిత్రంతోపాటు మలయాళం లో ఓ సినిమాకు ఛాన్స్ కొట్టేసింది బేబమ్మ.

అయితే.. బేబమ్మ 21 సెప్టెంబరు, 2023 తో తన 20 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని 21వ ఏట లోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా కృత్తి శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.