కృష్ణమ్మ వడిలో పోటెత్తనున్న వారాహి..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభంకానున్నది. దీంతో కృష్ణమ్మ వడిలో వారాహి యాత్ర పోటెత్తేలా జనసేనాని పవన్ యాత్ర సాగనున్నది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభంకానున్నది. దీంతో కృష్ణమ్మ వడిలో వారాహి యాత్ర ఈ సారి పోటెత్తేల కనిపిస్తోంది. అందుకూ  తెలుగు దేశం.., జనసేన నేతలు భారీ ఏర్పాట్లతో సమాయక్తమవుతున్నారు.అన్నీ ఏర్పాట్లు దగ్గరుండి మరి ఇరు పార్టీ నేతలు సమన్వయపరుస్తున్నారు. ఇప్పటికే పవన్ మంగళగిరి పార్టీ జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. నేడు అవనిగడ్డ నుంచి ప్రారంభించే ఆయన వారాహి యాత్రకు అన్నీ లైన్స్ క్లియర్ అయ్యాయి. అవనిగడ్డ నియోజవర్గం కేంద్రంగా నాలుగొవ విడత పవన్ యాత్ర బాధ్యతను ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులు కొల్లు రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో సాగే ఐదు రోజులు వారాహి యాత్రకు తెలుగు దేశం కూడా పాల్గొని.. పూర్తి మద్దతును తెలుపుతోందని ఆయన చెప్పారు.

రాజమండ్రి కేంద్రంగా టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించాక.. ఏపీలో రాజకీయ పరిస్ధితులు ఒక్కసారిగా మారాయి. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలతో లోకేష్ .., బాలకృష్ణలు పొత్తుపై టీడీపీ శ్రేణులను ఎలా ముందుకు నడపాలన్న బాధ్యతలను తీసుకున్నారు. నేడు కృష్ణాజిల్లా వేదికగా సాగే వారాహి యాత్రకు తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. లోకేష్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు వారాహి యాత్రకు తరలి వెళ్ళనున్నాయి. జిల్లాలో ప్రధాన నాయకులు సైతం ఫుల్ యాక్టీవ్ గా మారారు. జన సమీకరణకు పెద్ద ఎత్తున వాహన శ్రేణిని ఏర్పాటు చేయనున్నది. వారికి అక్కడ సౌకర్యాల కల్పించేలా బాధ్యతలను స్థానిక నాయకులకు ఎత్తుకున్నారు.

ఇరు పార్టీల పొత్తు తరువాత ప్రారంభించే వారాహి నాలుగొవ విడత యాత్ర.. రాజకీయంగా హీట్ ను పెంచనున్నది. ఇప్పటికే మూడు విడతల్లో జనసేనాని పవన్ వైసీపీ నాయకులను తూర్పార పట్టారు. ముఖ్యమంత్రి జగన్ ను సైతం వ్యక్తిగత దూషణలకు దిగారు. మూడు విడతల వారాహితో హాట్ హాట్ గా సాగిందనే చెప్పాలి. అయితే నాలుగొవ విడత ఇంకా హై ఓల్టేజ్ హీట్ ను రాజేయడం ఖాయమని విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల దగ్గరపడడం.., మరోవైపు తెలుగు దేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ లు వంటి వాటితో ఏపీ రాజకీయంగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుంది. వీటినే ప్రధానంగా ఏకరవుపెడుతూ పవన్ ప్రసంగాలు ఉండబోతున్నాయి.

దీంతో ఇరు పార్టీలను ఉద్దేశించి.. యాత్రలో పవన్ చేసే ప్రసంగ సభలకు భారీగా తెలుగు దేశం శ్రేణులు కూడా హాజరవ్వాలని నిర్ణయించుకున్నాయి. జనసైనికులతోపాటు టీడీపీ శ్రేణులు వారాహి యాత్రకు యాడ్ అయితే.. ఇక కృష్ణమ్మ వడిలో  వారాహి పోటెత్తడం ఖాయమన్నట్లు సోషల్ మీడియా విశ్లేషణలు దుమ్మురేపుతున్నాయి.