కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఇక హ్యాట్రిక్ ఖాయమేగా..!?

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ కు ప్రత్యర్థులు చిత్తవుతున్నారు.  

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కేసీఆర్ అన్నీ విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విజయానికి ఎన్ని మెట్లు అవసరమో.. వాటిని సర్ధుబాటు చేసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తరువాత తెలంగాణ లో రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బీఆర్ఎస్.. తిరిగి హ్యాట్రిక్ కోసం అన్నీ శక్తులను ఒడ్డుతోంది. మరోవైపు తెలంగాణలో అధికారం కోసం దశాబ్ధకాలంగా వేచిచూస్తున్న కాంగ్రెస్ కు.. ఈ సారి దింపుడుకల్లం వద్ద పెద్ద ఆశ అన్న  పరిస్థితిగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత.., ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ విషయాల్లో ఎంతో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుని ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు.

ఎన్నికలకు సరిగ్గా మూడు నెలలు సమయం ఉంది. అంతకు ముందు ఆరు నెల సమయం ఉండగానే.. గేమ్ ఛేంజ్ చేసిండు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించి.. గుణాత్మక రాజకీయాలు దేశానికి అవసరం అని చాటే ప్రయత్నం చేశారు. అయితే.. జాతీయ పార్టీల మద్దతను చూరగొనలేక పోయారు. మరోవైపు ఢిల్లీ నుంచి ఒకరకమైన ఒత్తిడి రావడం.. ఐటీ రైడ్స్.., కవిత అరెస్ట్ అంటూ వార్తలు తరుచూ తెరపైకి రావడంతో ప్లాన్ -బి అనివార్యమైంది. దీంతో రాత్రికి రాత్రే సీన్ అంతా మారింది. ఉదయం లేచేసరికి బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేయ్యడం.. తెలంగాణకు దిక్కు కిషన్ తప్ప.., అంత పొడిచేవాళ్ళే లేరంటూ పదవీ బాధ్యతలు అప్పగించడం వంటివి బీజేపీలో చకచక జరిగిపోయాయి. కట్ చేస్తే తెలంగాణలో బీజేపీ పరిస్థితి దొరగారి కనుసన్నల్లోనే అన్నట్లు మారింది. అప్పటి వరకు ఫుల్ జోష్ గా కనిపించిన బీజేపీ భారీ మార్పులతో కుదేలైంది. ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమేనని విశ్లేషణలు లేకపోలేదు.

ఈక్రమంలో ఎన్నికల నగారా మోగునున్న వేళ అన్నీ పార్టీల కన్నా ముందుగా అభ్యర్ధులను ప్రకటించి.. ముందు వరుసలో నిలిచారు కేసీఆర్. పార్టీలో మొదలయ్యే లుకలుకలను నిశితంగా పరిశీలించి.. వారిని సైలెంట్ చేసే తంత్రాలను సిద్ధం చేసుకున్నారు.

మరోవైపు విజయ దశమికి మేనిఫెస్టో రీలిజ్ అంటూ.. ప్రకటించారు. ఎన్నికల ముందు ఆ మేనిఫెస్ట్ కీలక పాత్ర పోషించనున్నదని వార్తలు వస్తున్నాయి. అందులో అధికారపార్టీ మేనిఫెస్టో ఇంకా పవర్ ఫుల్ హామీలతో ఉండాలని అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది. రైతు.., యువత.., మహిళలకు పెద్ద పీట వేసేలా బృహత్తర పథకాలను తీసుకొచ్చేందకు అడుగులు వేస్తున్నారు కేసీఆర్. కర్నాటక.., తమిళనాడు మేనిఫెస్టోలను పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం.