గన్ పార్క్ వేదికగా రాజకీయాలు గరంగరం..!

తెలంగాణలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికలకు నగారా మోగిన నాటి నుంచి రాజకీయాలు మునుపెన్నడు లేని విధంగా వేడెక్కాయి. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ పార్టీని గెలుపుదిశగా నడిపించేందుకు నేతలు అడుగులు వేస్తున్నారు. ఈనేపధ్యంలో 2023 సాధారణ ఎన్నికలు ప్రధానంగా అధికార బీఆర్ఎస్.., కాంగ్రెస్ మధ్యనే పోటాపోటి ఉండనున్నది. ఇప్పటికే ఇరు పార్టీలు నుంచి నేతలు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి..  ఈ పార్టీలో నుంచి ఆ పార్టీ కంటూ కండువాలు మారుస్తుంటే.. మరోవైపు రాజకీయ సద్ది విమర్శలు.., నిరూపణలేని ఆరోపణలతో ఎదురు దాడికి దిగుతున్నారు.

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో అమరవీరుల స్తూపం ముందు ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్ కు సవాల్ కూడా విసిరారు. ఈ క్రమంలో గన్ పార్క్ వద్దకు రేవంత్ వచ్చారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.., కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు.., కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

భారీగా మోహరించిన పోలీసులు.. రేవంత్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి.., వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్తల వాతావరణ పరిస్ధితి నెలకొంది. పోలీసులు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.