తెలంగాణలో జనసేన బలపడేందుకు ఢిల్లీ నుంచి తెరవెనుక వ్యూహం రచిస్తున్నారు. దీంతో ఆ పార్టీని దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు కమలనాథులు.

జనసేన పార్టీకీ గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా వివాదంగా ఆ పార్టీ గుర్తుకు ఈసీ ఫుల్ క్లారిటీ ఇస్తూ గ్లాసును జనసేనకు తిరిగి కేటాయించింది. దీంతో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

జనసేన పార్టీకీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు లేదు. ఆ పార్టీకి గుర్తే లేదంటూ వైసీపీ చేసిన ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగింపు పలికింది. మరోసారి ఆ పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయిస్తూ  మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సంబరాల్లో ఉన్న జనసేన కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలిపింది. అయితే ఈ వివాదంలో ఉన్న పార్టీ సింబల్ కు తిరిగి జనసేను కేటాయించడం వెనుక రాజకీయ వ్యూహాం లేకపోలేదు.

2019 లో జనసేన అభ్యర్ధులు గ్లాస్ గుర్తుపై ఏపీలో 137 స్థానాలో పోటీ చేయగా.. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన.., బీజేపీ పొత్తుతో తెలంగాణలో పోటీకి మోదీ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. బీజేపీ తెలంగాణాలో కొన్ని పార్లమెంట్ సిగ్మెంట్స్ లో కొద్దొగొప్ప బలంగా ఉంది. దీనికి తోడు పవన్ మాస్ ఇమేజ్ తోడైతే ఇంకా పార్టీ బలపడుతోందని కమల నాథులు తెరవెనుక వ్యూహం రచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులో ఉండే ముందుకు సాగుతున్నాయి. అలానే తెలంగాణలో కూడా పవన్ ఇమేజ్ ను వాడాలని చూస్తోంది బీజేపీ. అందుకు వివాదాలకు తెరదించేలా గ్లాసు సింబల్ ను జనసేన కు కేటాయించారని ఢిల్లీ గల్లీ సమాచారం షీకారు చేస్తోంది.

ఏపీలో ప్రస్తుత జనసేన పునాదులు పటిష్టం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. టీడీపీతో పొత్తుతో వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దూరమైన ట్రై యాంగిల్ లవ్ స్టోరి-2014 ఫార్మూలను 2024లో మరోసారి ఏపీలో అప్లై చేసేందుకు పథక రచన జరుగుతోందని విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి.    బీజేపీకి టీడీపీ కి పవన్ మధ్యవర్తిత్వం వహించి మోదీకి టీడీపీని దగ్గర చేయాలని ఆల్ రెడీ పావులు కదిపారు. ఇందులో భాగమే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలే ప్రత్యక్ష్య ఉదాహరణలు.  అందుకే అంటారు వన్ షాట్ త్రీ బర్డ్స్( వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ ) అన్నట్లు ఆపరేషన్ ఢీల్లీ చేస్తున్న రాజకీయం.