గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులు పలాయనమేనా..?

విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం  ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 ను ఎంతో అట్టహాసంగా నిర్వహించింది.

ఏపీలో జగన్ మోహన్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలను గాడిలో పెట్టేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అది ఇప్పటికీ సెట్ అవ్వలేదు అన్నది వాస్తవం. విభజన తరువాత దాపురించిని తీవ్ర లోటు బడ్జెట్ తో అతలాకుతలం చేస్తున్న తరుణంలో జగన్ ప్రకటించిన ఉచితాలు ఏపీ పాలిట శాపాలుగా మారాయి.

ఈ క్రమంలో నాలుగేళ్ళు నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పారిశ్రామీకరణ.., యువత ఉపాధి విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపలేకపోయింది. దీంతో సర్వత్ర వెనుకబడింది ఏపీ. పరిశ్రమలు రాక.. యువతకు ఉపాధి లేక అధిక శాతం మంది యువత చెన్నై.., బెంగుళూరు.., హైదరాబాద్ వంటి నగరాలకు తరలివెళ్లారు. ఇవి సర్వేలు చెప్తున్న సత్యాలు. ఈ రిపోర్టులను చూసిన జగన్.. ప్రజల దృష్టిని మరిలించేందకు విశాఖ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ అంటూ అట్టహాసంగా ఒక స్టోరిని తెరపైకి తీసుకొచ్చారు. కథ.., దర్శకత్వం.., స్ర్కిన్ ప్లే బాగానే సెట్ అయ్యింది. కానీ నిర్మాతలు ఆదిలోనే హ్యాండ్ ఇచ్చారు. దీంతో పెట్టుబడుల పథక రచన అట్టర్ ప్లాప్ అయిందనే చెప్పాలి.

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 వేదికగా 387 సంస్థలు.. 20 కీలక రంగాల్లో 13 లక్షల కోట్లు ఖర్చుపెట్టేందుకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తద్వారా 6 లక్షల మందికి ఉపాది అవకాశాలు రానున్నట్లు చెప్పారు. అలా చెప్పి.. నేటికి 7 నెలలు. 7 నెలలు కావస్తున్న ఒక్క సంస్థ కూడా ఏపీలో అడుగు మోపలేదంటూ అందుకు కారణం ఏమిటి..? పెట్టుబడి పెట్టి పరిశ్రమలను.., వ్యాపారాలను ప్రారంభిస్తాయని ఒప్పందం చేసుకున్న సంస్థలు మొహం చాటేసిన కారణాలు ఏమిటి..?

విశాఖ లో గ్లోబల్ సమ్మిట్ జరిగి 7 నెలలు కావస్తోంది. 387 సంస్థలు.. 20 కీలక రంగాల్లో 107 ఒప్పందాలను చేసుకున్నాయి. అందులో ప్రధానంగా.. ఎన్టీపీపీ ఒకటి. రూ. 2 లక్షల 35 వేల కోట్ల పెట్టుబడి 77 వేల మందికి ఉపాధి కల్పించే విధంగా అవగాహ ఒప్పందం చేసుకుంది. అలానే జేఎస్ డబ్లూ సంప్థ రూ. 50 వేల కోట్లతో 9 వేల 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఒప్పందాలు చేసుకుంది. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ . 21 వేల కోట్లు, అరబిందో 10 వేల కోట్లు.., ఆదిత్య బిర్లా 9,300 కోట్లు.., జిందాల్ స్టీల్ రూ. 7 వేలు కోట్లు ఇలా ఒప్పందాలు చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితోపాటు క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ.., సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలు ఒప్పందలో భాగంగా జూన్ 22న తమ కార్యక్రలపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ నేటి అవి ఏ దశలో ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి.

జీ – సమ్మిట్ మొత్తం వాణిజ్య, పరిశ్రమల శాఖలతోనే సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అలా ఒప్పందం చేసుకున్న దాదాపు 18 సంస్థలు ప్రభుత్వం నుంచి వేర్వేరు అనుమతుల కోసం.. ప్రాథమిక దశలోనే ఆగిపోయాయి. మరో 280 సంస్థలు నామమాత్రంగా.. ఎవరో ఒత్తిడి చేస్తే మొక్కుబడిగా వచ్చి.. పెద్దఎత్తున పెట్టుబడులు పెడతాం అని కలరింగ్ ఇచ్చి.. పత్తా లేకుండా పోయిన వాళ్లే ఈ సమ్మిట్ లో కనిపిస్తున్నారన్నది వాస్తవం.  

చివరికి గత్యంతరం లేక ప్రభుత్వం.. ఒప్పందం చేసుకున్న సంస్థలకు డెడ్ లైన్ విధించింది. ఫ్రిబవరి 2024 లోగా ఒప్పందం ప్రకారం పరిశ్రమల కార్యకలపాలు సాగిస్తే సరేసరి లేకుంటే చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రటకించింది. ఇందుకు తగ్గట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ పర్యవేక్షించాలని ఆదేశించారు జగన్.

విశాఖ కేంద్రంగా విధిలేక ఆడిన వింత నాటకం దాదాపు తెరపడినట్లేనా ..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయని కలరింగ్ ఇచ్చి.. చివరికి మొహం చాటేసి సంస్థలకు ఇలా డెడ్ లైన్ విధించడం ఏమిటో అని సోషల్ మీడియా సెటైరికల్ డైలాగ్స్ పేలుతున్నాయి. చివరికి ఏపీలో పెడతానన్న పెట్టుబడులు పలాయనం చిత్తగించినట్లేనా..? అంటే అవుననే సమాధానాలు వినవస్తున్నాయి.