చంద్రబాబుపై ఉండవల్లి అస్త్రం..!

మూలిగే నక్కపై తాటికాయ మాదిరిగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో ఉచ్చును బిగిసుకుంటుంది. దీంతో చంద్రబాబు పర్మినెంట్ గా జైలుకేనా..? అన్న వాదనలు తాజాగా తెరపైకి వస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో ఫీల్ వేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రెండు.., మూడు రాష్ట్రాల్లో ఈ కేసు ఉన్న కారణంగా అందులో జీఎస్టీతో ముడిపడి ఉన్న కేసు కావడంతో ఈ కేసును సీబీఐ విచారిస్తేనే సరైన న్యాయం జరిగిద్దని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసును ఈడి విచారిస్తున్న నేపథ్యంలో సిబిఐ ను కూడా ఇన్వాల్ చేస్తే అసలు నిజాలు భయటకొస్తాయని వాదనలు లేకపోలేదు. అందుకే ఉండవల్లి ఈ ఫిల్ ను ఏపీ హైకోర్టులో వేశారని తెలుస్తోంది.

అలానే ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ లో కూడా ఈ కేసు నడుస్తోందని మొత్తంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే .. కేసులో ఇన్వాల్డ్ అయిన హై ప్రోఫైల్డ్ వ్యక్తులు నిందితులుగా తెలుతారు. అంతేకాక కేసు కూడా ఎంతో వేగంగా పూర్తి చేయవచ్చు అన్న అభిప్రాయంతోనే ఈ పిల్ దాఖలు చేసినట్లు సమాచారం.

అంతేకాక ఉండవల్లి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రతివాదులుగా.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టరేట్, ఈడి డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఐడి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, చంద్రబాబు అచ్చం నాయుడు లతో కలిపి మొత్తం మరో 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు.