చంద్రబాబు అరెస్ట్.. అనేక ప్రశ్నలు..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో వెనుకబడుతున్నట్లు కనిపిస్తున్నాడు. తాత పేరు.., వారసత్వం.., వంశం పేరు తీసుకుంటే సరిపోదు.., కాస్తంత  సమయ స్ఫూర్తితో అనుకూల స్పందన  కూడా ఉండాలంటారు పెద్దలు.

రక్తం వారసత్వాన్ని ఇస్తోంది. వారసత్వం ఉనికిని చాటుతోంది. ఇవి అవసరానికి తగ్గట్లు వాడీ పారేసే మని కార్డులు కావు..మనిషి తాలూకు జీవన స్మృతులు. ఎదిగే వరకు పూర్వీకులు, వారసత్వం.. ఎదిగి ఒక స్థాయికి చెరుకున్నకా.. అంతా నేనే అనడం సరికాదు అన్నది జూనియర్ ఎన్టీఆర్ తీరును ప్రశ్నిస్తోంది. వంశం..తాత పేరుతో ఎదిగి నేడు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సాధించుకున్న ఎన్టీఆర్ తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుఖాల్లో కాకపోయినా..  కనీసం బాధల్లో ఉన్నప్పుడైనా కుటుంబానికి బాసటగా నిలవాలే కానీ..,  ఇలా మౌనం పాటించడం ఏంటీ అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై వారం కావస్తున్న మేనత్త భువనేశ్వరి.., బావ లోకేష్ ను పరామర్శించడానికి జూనియర్ కు మనసు రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందన తెలపలేదు. ఇదే రాజకీయ.., సినీ రంగాల్లో పెద్ద చర్చకు దారుతీస్తోంది.

గతంలో మాజీ మంత్రి కొడాలి నాని.., గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టారు. ఆ సమయంలో మీడియాతోపాటు సోషల్ మీడియా ఈ తిట్ల పురాణంతో షేకైంది. కానీ ఆ సమయంలో కూడా సకాలంలో జూనియర్ స్పందించలేదు. నేడు ఏపీలో రాజకీయం అత్యవసర  పరిస్ధితిని చూస్తోంది. తాత స్థాపించిన టీడీపీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ పెద్ద కుదుపును ఎదుర్కొంటుంది. లోకేష్ .., బాలకృష్ణలు పార్టీ పగ్గాలు చేపట్టినా.. సీనియర్లు వీరిని లెక్క చేయడం లేదు అన్న వార్తలు వినవస్తున్నాయి. కష్టకాలం కుటుంబం.., పార్టీ ఉంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మౌనం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అదే జూనియర్ మౌనం.. అనేక ప్రశ్నలు అన్న చాఫ్టర్ కు తెర తీస్తోంది.

సిని ఇండస్ట్రిలో హెరిటెజ్ కు ఎప్పుడూ పెద్దపీట ఉంటుంది. వారికుండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో అన్న ఎన్టీఆర్ .., ఆ తరువాత మెగాస్టార్ వారసులకు ఒక బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్ సెట్ చేసినా ఫ్లాట్ ఫాం పై వారసులు చిత్రసీమలో తారలుగా వెలుగుతారు. అలా వచ్చిన వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్. అయితే.., కుటుంబంలో కొన్ని వ్యక్తిగత విబేదాలు కారణంగా కుటుంబ విషయాలకు.., రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు జూనియర్. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన రాజకీయవేత్తలు.., ఐటీ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.  కానీ…, కుటుంబ సభ్యుడు.. స్వయాన మేనల్లుడైన ఎన్టీఆర్ పరామర్శకు కూడా ముందుకు రాకపోవడంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని.., వల్లభనేని వంశీలు జూనియర్ ఎన్టీఆర్ కు వీర విధేయులని ముద్ర ఉంది. వీరికి సామాజీకంగా.., రాజకీయంగా బ్యాక్ బోన్ కూడా ఎన్టీఆర్రే అన్నది తెలిసిందే. కానీ వారే చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరిని, బావ లోకేష్ లను నిత్యంలో మీడియాలో నోటికి పట్టరాని బూతులు తిరడతారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ బూతుల వార్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తునే ఉన్నాయి. ఇది నందమూరి, నారా కుటుంబాలకే కాదు.., టీడీపీకి ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పరిస్ధితిని అటూ నందమూరి ఫ్యాన్స్..,  ఇటూ కుటుంబం గమనిస్తునే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఖరారు చేయడంతో ఆయన ఇమేజ్ నందమూరి ఫ్యాన్స్ పై కూడా రిఫ్టెక్ట్ అవుతోంది. దీంతో నందమూరి.., మెగా ఫ్యామిలీలకు సంబంధించిన ఫ్యాన్స్ అంతా పవన్ వైపు అమాంతం టర్న్ అయ్యింది. దీంతో నందమూరి కుటుంబం మధ్యలో ఏర్పడిన అంతరాలు.. దూబాయ్ టూర్ లో ఎన్టీఆర్ సంబరాలు.. జైళ్లో చంద్రబాబు అంటూ టైటిల్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీన్ని జూనియర్ ఎలా సమర్ధించుకుంటాడో చూడాలి.