చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ హాట్ కామెంట్స్..!

32

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీడీపీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించి గతంలో మంత్రి కేటీఆర్ స్పందించలేదు. అయితే మంగళవారం ఆయన కొంచెం ఘాటుగానే చంద్రబాబు అరెస్ట్ పై నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయనపై అభిమానం ఉంటే ఏపీకి వెళ్లి ధర్నాలు చేయాలని.., హైదరాబాద్ లో రాజకీయం చేయాల్సిన అవసరం ఏమిటని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. కర్నూల్, అమరావతి, రాజమండ్రిలో ధర్నాలు చేయకుండా ఇక్కడేందుకు చేస్తున్నారని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదన్నారు కేటీఆర్.

ఏపీలో రెండు పార్టీల మధ్య జరిగే తగాదాలో మా పార్టీ తలదూర్చదని కేటీఆర్ వివరించారు. నారా లోకేష్.., జగన్ .., పవన్ నాకు దోస్తులేనని.., వారితో మాకు ఎటువంటి గొడవలు లేవన్నారు. ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేస్తారని లోకేష్ నాకు ఫోన్ చేసి మాట్లాడారని..  దానికి శాంతి, భద్రతలకు విఘాతం కలిగితే ఎలా అని తాను అడిగినట్లు కేటీఆర్ వివరించారు. తమ పార్టీలో కొంతమంది చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతున్నారని.. అది వారి వ్యక్తిగతం అన్నారు. దానికి బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు.

32 thoughts on “చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ హాట్ కామెంట్స్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *