చంద్రబాబు కేసుకు గ్రహణం..రేపే కీలక నిర్ణయం..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభించడం లేదు. ఆయన వేస్తున్న పిటిషన్లు ఇంకా ఒక దారికి రాకుండా నలుగుతూనే ఉన్నాయి. దీంతో ఆయన కొంతకాలం జైల్లో ఉండక తప్పదన్నట్లు కనిపిస్తోంది.

ఏపీ రాజకీయాలు వేడెక్కెలా చేసిన చంద్రబాబు అరెస్ట్.. కోర్టుల్లో ఇంకా కొలిక్కిరావడం లేదు.  ఎటువంటి అవినీతి మరక పడకుండా ఆయనను బయటకు  తీసుకురావాలని ఆయన తరుఫున న్యాయవాదులు భావిస్తుంటే.. కోర్టుల్లో చిక్కులు వీడడం లేదు. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయమూర్తి డిస్మిస్ చేయగా.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా సీఐడి రిమాండ్ ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. మరోవైపు ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్.., సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.

అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు భేటి కానున్న సందర్భంగా చంద్రబాబు కేసును లిస్ట్ చేయలేదు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు కేసును అత్యవసర విచారణ కోరుతూ న్యాయవాదులు సీజైఐకి మెమో సమర్పించారు. అయితే ఇవాళ కుదరపోయినప్పటికీ.. రేపు విచారణకు రావాల్సి ఉంది. అయితే రేపు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకుంటే ఎల్లుండు నుంచి అక్టోంబర్ 2వ తేదీ వరకు సుప్రీం కోర్టుకు సెలువులు ఉన్నాయి.

అలా జరిగితే వచ్చే నెల 3వ తేదీ వరకూ చంద్రబాబు వేసిన పిటిషన్ సుప్రీంలో వాయిదా పడక తప్పదు.  ఈ నేపథ్యంలో చంద్రబాబు తరుఫున వాదించే లాయర్లు సీజేఐను కలిసి రేపు క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించి స్పెషల్ రిక్వేష్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఈ రోజు లీవ్ తీసుకున్నారు. దీంతో ఇక్కడున్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది.