చంద్రబాబు పరిస్ధితి చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి..!

చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో టీడీపీ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు ఆయన కుటుంబం కూడా రోడ్డెక్కి తమ గళాన్ని అన్ని దిక్కుల వినిపించేలా ప్రయత్నిస్తోంది.

చంద్రబాబు జైల్లో.., లోకేష్ ఢిల్లీలో.., భువనేశ్వరి.., బ్రాహ్మణి రాజమండ్రిలో మకాం.. ఇలా ఒక్క అరెస్ట్ తో టీడీపీ అధినేత కుటుంబం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారింది. మాంచి ఎన్నికల వేడిలో రగులుతున్న సమయంలో చిరకాల ప్రత్యర్థిగా భావించే చంద్రబాబును అదును చూసి దెబ్బకొట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ దెబ్బతో రాష్ట్రం వ్యాప్తంగా టీడీపీలో ఒక రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది.   

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును భువనేశ్వరి, యనమల రామకృష్ణుడు పరామర్శించారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో మీడియా ముందు మాట్లాడేందుకు ఇరువురు విముఖత వ్యక్తం చేశారు. ఎంతో విషాదవదనంతో భువనేశ్వరి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం యనమల మీడియా సమావేశం జైల్లో బాబు ధీనస్థితిని వివరించారు.

జైల్లో బాబు ఆరోగ్య పరిస్ధితి రోజురోజుకు దిగుజారుతోందన్నారు. ప్రస్తుతం ఆరోగ్య ఆందోళనకరంగానే ఉందన్నారు. సెల్లో దోమలు బెడద ఎక్కువగా ఉందని.. కనీసం ఏసీ సదుపాయం కూడా లేదన్నారు. అలానే స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వడం లేదని.., వైరల్ ఫీవర్ భారీన పడితే ఎవరు గ్యారెంటీ అని ఆయన ప్రశ్నించారు. బాబు ధీనస్ధితిని చూస్తే కన్నీరు ఆగడంలేదన్నారు. నిత్యం కేడర్ గురించి ఆలోచించే చంద్రబాబు.. ఒంటరిగా జైలుకు పరిమితం అయ్యాయని అవేదన వ్యక్తం చేశారు.

కేవలం కక్ష్యసాధింపుతోనే చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు.