జగనాసుర దహనంకు కదిలిరండి..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తో తెలుగు దేశం శ్రేణులు యుద్ధానికి సిద్ధమైయ్యాయి. ఎన్నివిధాలుగా అణిచివేయాలని చూసినా..తాము బంతి మాదిగా బౌన్స్ అవుతామని ఆ పార్టీ అధిష్టానం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నారు. ఆయన అరెస్ట్ తో తెలుగుదేశంపార్టీ డిఫెస్స్ లో పడిందని అందరూ భావిస్తున్నా.. అంతకు పదింతలు రెట్టింపు ఉత్సహంతో వినూత్న నిరసనలతో ముందుకు సాగుతున్నారు. అంతిమంగా పార్టీని ముందుకు నడిపించేందకు అధిష్టానంతో పాటు.., ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న కార్యక్రమంలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అలానే చంద్రబాబు అరెస్ట్ కు సంఘీభావం తెలిపేందుకు సందర్భాలను క్రియేట్ చేస్తూ.. పార్టీ నేతలతో పాటు ప్రజలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు.

సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ తరువాత తెలుగుదేశం పార్టీ వినూత్నకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మో త మోగిద్దామని శబ్ధంతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తరవాత నిరాహార దీక్షలు చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. అలానే కాంతితో క్రాంతి కార్యక్రమంతో దీపాలను వెలిగించి నిరసనలు వ్యక్తం చేశారు. చేతుల సంకెళ్ళు వేసుకుని మరి నిరసన వ్యక్తం చేశారు. తాజా విజయదశమి సందర్భంగా జగనాసుర దహనం పేరుతో కార్యక్రమానికి పిలుపు నిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సైకో పోవాలని కాగితం పై రాసి దహనం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని నినదించడంతో పాటు ఆయనకు సంఘీభావం తెలపాలని కోరారు.