జనసేనాని పవర్ గేర్..హై స్పీడ్ లో ఏపీ పాలిటిక్స్..!

జనసేనాని పవన్ పొలిటికల్ పవర్ గేర్ వేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ తో తన పార్టీ పొత్తు కన్ఫామ్ చేయడంతో అధికార.., విపక్షాల మధ్య రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో తూర్పు దిక్కునున్న రాజమండ్రిలో పొడుపు పొత్తు పొడిచింది. టీడీపీ-జనసేన రెండూ కూటములు వచ్చే 2024 ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్లు పవన్ మీడియా ముఖంగా తెల్చి చెప్పాడు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాయి. బీజేపీ కలిసి వస్తే వచ్చింది..లేకుంటే లేదు.. కానీ.. మా పయనం మాత్రం టీడీపీ.., చంద్రబాబుతోనే అని కుండలుబద్ధలు కొట్టాడు పవన్. దీంతో కంగు తిన్న బీజేపీ .. నష్టనివారణ చర్యలు చేపట్టింది. మారుతున్న రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్నీ వ్యవస్థల నుంచి ట్రయిల్ రన్ మొదలుపెట్టింది కాషాయ దళం. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదిగా ఉన్న చంద్రబాబుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం.., ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జైళ్లో చంద్రబాబుతో పవన్ ములాఖత్ రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తెలుగు దేశంతో పొత్తు అవసరమని పవన్ చెప్పారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుభవం.., దార్శినికత.., క్రమశిక్షణతో కూడిన రాజకీయాల నేపధ్యంలోనే తాను పొత్తు నిర్ణయం తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు.

అలానే ఐక్య కార్యాచరణ ప్రకటించి పెరుగి ఉన్న నిత్యావసర ధరలు.., ఇసుక, మద్యం.., పెట్రోల్.., డిజిల్ వంటివాటిపై పోరాటం సాగిస్తామని పవన్ చెప్పారు. ఇందుకు విపక్షాలన్నీ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. అందుకే తాను తెలుగు దేశంతో పొత్తు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. మరోవైపు జగన్ రెడ్డి ప్రభుత్వంపై.. మంత్రులపై విరుచుకుపడ్డారు. ఇక జగన్ రెడ్డికి కావాల్సినంత యుద్ధం.. అవసరమైతే సివిల్ వార్ ను కూడా ఇస్తున్నానని పవన్ పంచ్ డైలాగ్స్ పేల్చాడు.

ఇదిలా ఉంటే ఊహించని రాజకీయాల పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ తన కామెంట్స్ దండయాత్రను ప్రారంభించింది. అన్ని మాధ్యమాల్లో  పవన్ .., చంద్రబాబుపై వైసీపీ మంత్రులు.., ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు పవన్ నిర్ణయాన్ని ఇరు పార్టీ సీనియర్లు స్వాగతించారు. దీంతో ఏపీలో అధికార వైసీపీ పై వార్ డిక్లేరైందని ఇంకోవైపు చర్చలు ఊపందుకున్నాయి.