దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ నడుస్తుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక పై కేంద్రం కసరత్తు చేస్తోంది. అందుకు విశ్వప్రయత్నాలతో అడుగులు వేస్తోంది.

జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక పై సర్వత్ర రాజకీయ చర్చకు తెరతీస్తుంది. ఈ నేపథ్యంలో కమిటీ అధ్యక్షుడు రామ్ నాథ్  కోవింద్ కు లా కమిషన్ తన సూచనలను బుధవారం అందించనున్నది. కేంద్రం  ఇప్పటికే జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీతో నేడు లా కమిషన్ భేటి కానున్నది. జమిలి పై న్యాయపరంగా తలెత్తే చిక్కులను సంబంధించి.., ఎదుర్కొనే భవిష్యత్తు అంశాలపై లా కమిషన్ తగు సూచనలను నివేదిక రూపంలో అందించనున్నది.

అందరి సూచనలు తీసుకున్న తర్వాత ఉన్నత స్థాయి కమిటీ చివరి సారి భేటీ కానున్నది. సెప్టెంబర్ 2న  8 మందితో  కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రెండు పర్యాయాలు  కమిటీ సమావేశమైంది. లా కమిషన్ తో నేడు సమావేశం అయితే మూడు పర్యాయాలు ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు జమిలి ఎన్నికలపై సమావేశం అయినట్లు భావించాల్సి ఉంది.

లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీజెపీ జమిలి ఎన్నికలకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రానున్న సార్వత్రిక  ఎన్నికల్లోనే జమిలి విధానాన్ని తీసుకొస్తారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్దచర్చ ననడుస్తుంది.