టాప్ వన్ లో తెలంగాణ..ఇక తిరుగులేదు..!
తెలంగాణ అన్నీ రంగాలు తిరుగులేని ధైర్యంతో పురోగమిస్తోంది. హైదరాబాద్ నలుదిశలా సాధించిన ప్రగతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

దేశంలోనే అత్యంత మానవ వనరుల కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఈ వనరులను కెసిఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా సద్వినియోగపరుచుకుంటుంది. గడిచిన తొమ్మిదేళ్ళుగా ఐటీ, సాంకేతికతను హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ ఎంతో శ్రద్ధ కనపరిచారు. పరిశ్రమలను ఆహ్వానించడానికి కేటీఆర్ చేస్తున్న కృషి ఆదర్శవంతమని అందరూ భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీ పరిశ్రమలతో కలకలాడుతోంది. జీనోమ్ వ్యాలీ శరవేగంగా విస్తరించుకుంటూ హద్దులను జరుకుంటూ వృద్ధి చెందుతోంది. బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్ ను మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసి, ప్రారంభించారు.
భారత్ సీరం సంస్థకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జీనోమ్ వ్యాలీ ఫేస్ -2 వరకు వచ్చామని.. మరికొద్ది రోజుల్లో ఫేస్-3 ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడలేని పారిశ్రామిక అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వేగంగా పారిశ్రామీకరణ, ఉపాధి కల్పన తెలంగాణలో జరుగుతుందని ఆయన చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని ఆయన వివరించారు.
అయితే.., దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడున్న మౌళిక వసతులు.., ప్రభుత్వ పారదర్శక అనుమతలు దేశంలో ఎక్కడ లేవన్నది వాస్తవం. జీనోమ్ వ్యాలీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తుంది.