టీడీపీ కొత్త బాస్ బ్రాహ్మిణి..పిక్స్..!

స్కిల్డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరంఏపీలో రాజకీయాలుఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా త్రిశంకు స్వర్గం పడినట్లైంది.

ఏపీలో రాజకీయాలు కొత్త రంగుల పులిముకుంటున్నాయి.  చంద్రబాబు అరెస్టుతో  తెలుగుదేశం పార్టీ  దిక్కుతోచని స్థితిలో ఉంది.  మరోవైపు  లోకేష్ అరెస్ట్ అవుతాడని జగన్ ప్రభుత్వం లీకులిస్తోంది.  అలానే  పార్టీలో  కొంతమంది సీనియర్లను  అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సీఐడీ హింట్స్ ఇస్తోంది. దీంతో  అనూహ్యంగా  టిడిపి  పగ్గాలను  కొత్త బాస్ చేతిలో పెట్టేందుకు  పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.  ఆ కొత్త బాసే ఎవరో కాదు లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

స్కిల్ డెవలప్మెంట్ కేసులో  చంద్రబాబు అరెస్టు అనంతరం  సిఐడి చీఫ్ సంజయ్ కుమార్  సంచల వ్యాఖ్యలు చేశారు.  త్వరలో  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్.ఫైబర్ గ్రిడ్ కేసుల్లో  నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని  మీడియాకు హింట్ ఇచ్చారు.  ఆనాటి నుంచి  ప్రతి రోజు ఏదో ఒక  సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై  నారా లోకేష్ అరెస్టు విషయం  తెరపైకి వస్తూనే ఉంది.  ఈ క్రమంలో  చంద్రబాబు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయటంతో  టీడీపీ శ్రేణులు  డైలామాలో పడ్డాయి.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి  నారా  లోకేష్ అరెస్టు అవుతాడన్న వార్త  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.  ఇటీవల  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  మీడియా ముఖంగా  నారా లోకేష్ అరెస్ట్ అయితే..  ఆయన సతీమణి  బ్రాహ్మణికి  పార్టీ పగ్గాలు అప్పజెప్పి  ముందుకు నడిపిస్తామని  ధీమా వ్యక్తం చేశారు.  ఒకపక్క చంద్రబాబు అరెస్టు ..  మరోవైపు  ఢిల్లీ పర్యటనలో లోకేష్.. ఇంకోపక్క  కుటుంబం అస్తవ్యస్తంగా మారిన క్రమంలో మహిళలతో  రాజమండ్రి రోడ్డెక్కి  క్యాండిల్ ర్యాలీ తీసి.. నిరసన వ్యక్తం చేశారు బ్రాహ్మిణి. నాటి నుంచి పార్టీలో  మంచి గుర్తింపు సాధించింది.  తాతకు తండ్రికి  తగ్గ  వారసురాలిగా  బ్రాహ్మిని  పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నాయి.  ఈ క్రమంలోనే  నారా బ్రాహ్మణి పేరు  అనూహ్యంగా తెరపైకి వచ్చింది.  మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా  నారా బ్రాహ్మణి నాయకత్వాన్ని పూర్తిగా  విశ్వసిస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను  ఎంతమందిని అరెస్ట్ చేసినా  భయపడేది పార్టీ శ్రేణులు తెగేసి చెబుతున్నాయి. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశమని.., అరెస్ట్ లతో పార్టీకి వచ్చిన డోకా ఏమీ లేదని శ్రేణులు మనోధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.