టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేకు నోటీసులు..!

న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన ఘటనలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో పాటు మరో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏసీబీ.., హైకోర్టులలో చుక్కెదురైంది. దీంతో మనస్తాపానికి గురైన టీడీపీ శ్రేణులు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేశారు.

బుధవారం ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో కావాలనే జడ్జీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన డివిజన్ బెంచ్ న్యాయమూర్తికి కొన్ని సాక్ష్యాలను నివేదించారు. జడ్జీలపై దూషణలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని హై కోర్టు తీవ్రంగా ఖండించింది.

ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్న 26మందికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ జాబితాలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, సీనియర్ పొలిటీషన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు మరికొందరు ఉన్నారు. సోషల్ మీడియా అకౌంట్ లను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లను కూడా నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది.  తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించి.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.