టీడీపీ V/S జనసేన.. సీఎం అభ్యర్ధి పవన్..!?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలురసకందాలో పడ్డాయి. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నుపరామర్శించిన పవన్..రాజమండ్రి వేదికగాపొత్తుప్రస్తావనను తెరపైకి తీసుకురావడం చర్చకు దారితీస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టిడిపి తో  జనసేన పొత్తు ఖరారు అయ్యింది. కలిసి  ప్రయాణిస్తామని.. ఇందులో ఎటువంటి మార్పు ఉండదని పవన్ తేల్చి చెప్పారు.   దీన్ని రాజకీయ కోణంలో  తెలుగుదేశం పార్టీ  జనసేన ను ఆహ్వానిస్తున్నప్పటికీ  ఎక్కడో వారిలో కూడా  కొంత అభద్రతాభావం నెలకొంది.  రేపు సీట్ల పంపిణీ  పై పెద్ద చర్చ నడిచేటట్లుగా గ్రహించిన టీడీపీ సీనియర్లు కొంత నూన్యత భావంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  జగసేనాలో కొత్త వాదనలు తెరపైకి వస్తోంది.

జనసేన పార్టీలో  రెండు వర్గాలుగా విడిపోయి  భిన్న వాదాలను వినిపిస్తున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ ను  ముఖ్యమంత్రిగా చూడాలని ఒక వర్గం వారు  పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తుంటే.. మరో వర్గం వారు  ఆయనను  బలమైన నేతగా  రాజకీయాల్లో నిలదుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండువర్గాల భిన్నాభిప్రాయాలు ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే..,  కాపు సామాజిక వర్గంలో 1953  నుంచి విభజిత ఏపీ 2019 వరకు ఇప్పటివరకు ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు.  ఆనాడు వంగవీటి రంగాచిరంజీవి  చేసిన ప్రయత్నాలు కూడా  విఫలమయ్యాయి.  అయితే పవన్  రాజకీయంగా  బలపడితేనే  కాపులకు ముఖ్యమంత్రి పదవి  ఆకాంక్ష నెరవేరుతుందని ఓ వర్గం భావిస్తున్నారు.  టిడిపి పొత్తులో లేకుండా నేరుగా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిస్తే.. పార్టీ ఘోర పరాజయం తప్పదని జనసేనలోని సీనియర్ వర్గం భావిస్తోంది.  మరొక వర్గం వారు  టిడిపి జనసేన పొత్తులో  ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ని ప్రకటించాలని  డిమాండ్స్ వినిపిస్తున్నారు. అలా కాకపోతే  తాము పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతామని కూడా  ప్రత్యక్ష బెదిరింపులకు దిగుతు న్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో   వైసీపీకి   గడ్డుకాలం దాపరించింది.  ప్రతిదీ రివర్స్లో  ఆ పార్టీకి.., ప్రభుత్వానికి  చెంపపెట్టులా మారున్నాయి.  ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో  వైసీపీకి ఎదురుగాలి తప్పదు అన్నట్లు విశ్లేషనలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు  పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు  పార్టీకి  నష్టమే కాదు.. సీట్లు రాబట్టడ కూడా కనకష్టమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా జనసేనకు ఎక్కువ స్థానాలు  రావు అన్నది స్పష్టం  కాబట్టి.. బలమైన పార్టీగా నిలదొక్కుకోవాడానికి పవన్ చేస్తున్న పొత్తు ఆలోచన ది బెస్ట్ అని  జనసేన సీనియర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం నేపథ్యంలో  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం కన్నా.. సుప్తచేతనావస్థలో ఉన్న పార్టీని బ్రతికించుకోవడం.. ఆ తరువాత బలపర్చుకోవడం ఆపార్టీకి ఉన్న ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే టిడిపి తో పొత్తుతో  ముందుకు సాగడం ఆపార్టీకి కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా  జనసేన – టిడిపి పొత్తు  ఏపీ భవిష్యత్తుకు తొలి మెట్టు అంటూ  ఇరుపార్టీ నేతలు భావిస్తున్నారు.