ఢీల్లీ టూర్ తో కథ కంచికి.. ఇక జగన్ ఇంటికేనా..?

జగన్ ఢిల్లీ పర్యటన అంత ఆసక్తికరంగా సాగలేదు అన్నది వాస్తవం. ఆయన ఊహించింది ఒకటి.. అక్కడికి వెళ్ళిన తరువాత జరిగింది ఇంకోకటని సమాచారం.

చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం రగులుతున్నప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్  రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.., పెండింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ కు అడుగడుగునా బీజేపీ కేంద్రమంత్రులు నిలదీసినట్లు విశ్వనీయ సమాచారం. సీనియర్ పొలిటీషిన్ చంద్రబాబు పట్ల మీరు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం అని జగన్ మోహం మీదే చెప్పినట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నేతలైతే ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్ విషయం మీరు తప్పు చేసినట్లు అనిపించడం లేదా..? అని ప్రశ్నించినట్లుగా ఢిల్లీ గల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ కలిసిన కేంద్ర మంత్రులంతా ఇదే విషయంపై చర్చించి.. ఆయనను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక జగన్ ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు పెద్దలకు అందించి.. తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

అనంతరం అమిత్ షా భేటి అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. అక్కడు కూడా చంద్రబాబు టాపిక్ పైనే చర్చ నడిచినట్లు టాక్. అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు.., ముఖ్యంగా పోలవరానికి రావాల్సిన పెండింగ్ బిల్లులకు సంబంధిచిన నిధులు గురించి  అమిత్ షాతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ అంత ఆసక్తికరంగా సాగలేదనే చెప్పాలి.

నిధులు కోసం .., రాష్ట్ర సమస్యల కోసం వెళ్తే చంద్రబాబు అరెస్ట్.. అది ఎన్నికల వేళ ఎందుకంత సాహసం అని కేంద్ర మంత్రులు అడగటంపై జగన్ కొంచెం ఇబ్బందిగానే ఫీలయ్యారని తెలుస్తోంది. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. చంద్రబాబు అరెస్ట్  జగన్ తోపాటు ఆయన వెనకుండి నడిపించే వారికి సైతం చుట్టుకునేలా కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం జగన్ శనివారం ఏపీకి రానున్నారు.