దళపతికి దడబాటు లేదుగా..? ఇవన్నీ రాజకీయ ఎంట్రీకేగా..?

తమిళ తలపతి విజయ్ రాజకీయాల్లో రాబోతున్నారని తమిళనాట లీకులు షీకారు చేస్తున్నాయి.

తమిళనాట సినిమాలు- రాజకీయాలను వేరే చేసి చూడలేం. ఎందుకంటే ఇక్కడి ప్రజలు రాజకీయ నేతలతో పాటు హీరోలను కూడా ఎంతగానో అభిమానిస్తారు కాబట్టి. అందుకే ఎంజేఆర్, జయలలిత సిల్వర్ స్కిన్ తోపాటు ప్రజారణ్యంలో ఒక వెలుగు వెలిగారు. సినిమాల్లో పేరు ప్రతిష్టలతోపాటు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో వచ్చి రాణించారు. ముఖ్యమంత్రులు అయ్యారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం హీరోలు రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు.

ఆ మధ్య రజనీకాంత్ పార్టీ పెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు షీకారు చేశాయి. కానీ.., పార్టీ పేరును ఖరారు చేసే దిశగా వెళ్లినా.. ఆదిలోని హంసపాదులా అంతగా ఆయన వాటిపై ఇంట్రస్ట్ చూపలేకపోయారు. అలానే కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం – పీపుల్స్ సెంటర్ ఫర్ జస్టిస్ అంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ తమిళనాట అంతగా ఈ పార్టీ ప్రభావం చూపలేకపోయింది.

ఈ మధ్య విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తారు.. 2019 లో కుప్పం నుంచి చంద్రబాబుకు ప్రత్యర్ధిగా నిలబడతాడు అంటూ ప్రచారం సాగింది కానీ.. దాన్ని విశాల్ కొట్టివేయడంతో ఆ వార్తలకు బ్రేక్ పడిందిం. ఇలా తమిళనాట సినిమా వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేయడం సర్వసాధరణమనే చెప్పాలి. ఈ కోవలోనే  మరో టాప్ హీరో విజయ్  రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

సోమవారం జరిగే గాంధీ జయంతి వేడుకల్లో తమిళనాడులోని ప్రతి ఊరులోని మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేయాలని అభిమానులకు దళపతి విజయ్ పిలుపు నిచ్చారు. అలానే అప్పటిలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాగుల జిల్లాకి చెందిన ప్రముఖుల కుటుంబాలను అక్కడి వెళ్లి సత్కరించాలని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా ఇంకా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులతో సమావేశాలు.., పలు సేవాల కార్యక్రమాల్లో తానే స్వయంగా పాల్గొనడం వంటి వాటిని ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు విజయ్.

విజయ్ ఇంట్రస్ట్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ సారి సొంత పార్టీ పెట్టాలన్న సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.