తెలంగాణలో మోదీ టూర్.. ‘బీ’ టీంపై ఫుల్ క్లారిటీ..!

తెలంగాణలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అంత ఆసక్తికరంగా సాగలేదనే చెప్పాలి. ప్రధాని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అది మరిచిందనే చెప్పాలి.అది ఎంత వరకు నిజం..?

తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటించారు. మహబూబ్ నగర్ లో పర్యటించి మోదీ.. జాతీయ రహదారులకు.., రైల్వే తదితర అభివృద్ధి పనులను సంబంధించి రూ.13,500 కోట్ల కు సంబంధించి పనులకు వర్చువల్ విధానం ప్రారంభించారు. అలానే కొన్నింటికీ శంకుస్థాపనలు చేశారు.  ఈ క్రమంలో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొని.., ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్.., బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ వేరే పార్టీ చేతుల్లో ఉందని.., నమో అంటే ఏమిటో తెలంగాణ ప్రజకు తెలుసనని మోదీ చెప్పుకొచ్చారు. అంతకు ముందు మోదీ పర్యాటనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పెద్దఎత్తున ప్రధాన కూడళ్ళల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ కు ఇచ్చిన హామీలకు ఏం చేశావని నిలదీశారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తానని మరిచావ్ గా మోదీ అంటూ ప్రశ్నించారు. నిజామాబాద్ కు పసుపు బోర్డును ఏం చేశావ్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ శ్రేణులు మోదీని నిలదీశారు. ఈ క్రమంలో బీజేపీ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మంత్రులపై విరుచుకుపడ్డారు.

ఇదిలా ఉంటే బీజేపీకి బీఆర్ఎస్ ‘బి’ టీమ్ అని చెప్తునే రాజకీయంగా ఇరు పార్టీలు కత్తులు దూసుకోవడంలో ఆంతర్యమేంటో అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. గతంలో బీజేపీపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ .., నేడు కాంగ్రెస్ తప్ప మాకు ప్రత్యర్ధి పార్టీ ఏదీ లేదని చెప్పుకొస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని.. తెలంగాణ కాంగ్రెస్ ను చంక నాకించేందుకు పథకం ప్రకారం బీజేపీ ఢిల్లీ నుంచి పావులు కదుపుతోందన్న వాదన లేకపోలేదు.

తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బిల్స్ మొత్తాన్ని రిలీజ్ చేస్తూ బీఆర్ఎస్ కు బీజేపీ ఎంతగానో సహకరిస్తోంది. మొన్న ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాం లో  కవిత కేసును ఈడీ విచారణ పేరుతో హడావుడి చేసి చప్పున చల్లార్చి.. విచారణకు.., నోటీసులకే పరిమితం చేసింది. ఎందుకు..? కేసీఆర్ బిడ్డ కాబట్టే.. కదా.. అన్న చర్చ లేకపోలేదు. బీజేపీతో అంతర్గత సంబంధాలు, తెరవెనుక రాజకీయ ములాఖత్ ఉన్నాయ్ కాబట్టే ఆమెను లైట్ తీసుకుని వదిలేశారని మరో వాదన లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ సర్కార్ మంత్రి అరెస్ట్ తోపాటు ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ కవిత మాత్రం ఈ అరెస్ట్ నుంచి తప్పించుకుంది అన్నది మాత్రం సోషల్ మీడియాలో చెప్తున్న వాస్తవాలు.

ఈ పొలిటికల్ డ్రామాలో భాగం. అందుకే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే.. బీజేపీ అన్నీ తెలంగాణ కు ఇచ్చేస్తోందని అన్నది ఇరు పార్టీల పొలిటికల్ గేమ్ లో పార్టికల్సే.  ఎల్లూండు ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటించనున్నారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని అక్కడి రైతుల డిమాండ్ ఈ నాటిది కాదు. ఈ క్రమంలో మోది మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఎల్లుండు నిజామాబాద్ పర్యటన ఎంతో ప్రధాన్యత సంతరించుకుంది. పసుపు బోర్డుకు సంబంధించిన విధి విధానాలను నిజామాబాద్ పర్యటనలో భాగంగా మోదీ ప్రకటిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై బీజేపీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఏదీ ఏమైనా కాంగ్రెస్ ను జాతీయంగానే కాదు.. రాష్ట్రాల్లో కూడా తొక్కేయ్యాలనే ప్రయత్నంలో భాగంగానే మోదీ అండ్ కో ప్రాంతీయ పార్టీలో ఆడే డ్రామాల్లో భాగమే తెలంగాణలో ప్లే చేస్తున్న పొటికల్ స్ట్రాటజీ అని చెప్పాలి. అందుకే తెరవెనుకుండి బీఆర్ఎస్ తిట్టిపోస్తూ.. కాంగ్రెస్ ను, కమ్యూనిస్టులను పాతాలనికి తొక్కిపట్టి నారా తీస్తోంది అన్నదే కాషాయదళం వ్యూహంగా కనిపిస్తోంది అన్నది అక్షర సత్యం.