జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ చిత్రం యొక్క ఫుల్ అప్డేడ్ ను దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణ..,మిక్కిలనేని సుధాకర్ నేతృత్వంలో యువసుధ ఆర్ట్స్, కొసరాజు హరికృష్ణ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా స్థాయిలో దేవర ను నిర్మిస్తున్నారు.

అయితే నిన్న దర్శకుడు కొరటాల చిత్రం అప్డేట్ ను మీడియా వివరించారు.భయం అనే ఉద్వేగాన్ని కొత్త కోణంలో చెప్పే కథలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వస్తోందని..నటీనటుల భావోద్వేగాలు, కథ గమనాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకే కథను రెండు భాగాలుగా చేస్తున్నట్లు కొరటాల స్పష్టం చేశారు. ఇందులో బలమైన పాత్రలెన్నో ఉన్నాయని.., నిడివిని దృష్టిలో ఉంచుకుని ఒక్క సన్నివేశం.., ఒక్క సంభాషణ కూడా తొలగించలేక పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.., నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారన్నారు. అయితే పార్ట్ -1 షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.