మాదాపూర్ డ్రగ్ కేసులో సినీ నటుడు నవదీప్ ఇన్వాల్మెంట్ ఉందని అభియోగంతో నార్కోటిక్ పోలీసులు విచారించారు. ఈ విచారణ లో కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టారు.

మాదాపూర్ డ్రగ్ కేసు కీలకంగా మారింది. శనివారం నార్కోటిక్స్ పోలీసులు విచారించారు. రాంచందర్ తో ఉన్న సంబంధాలపై ప్రధానం ఆరా తీసినట్లు సమాచారం. నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో నవదీప్ విచారణ సాగింది. ఈ కేసులో నవదీప్ ప్రమేయం ఎంతమేరకు ఉందన్న కోణంలో పలు ప్రశ్నలు అధికారులు పోలీసులు. నార్కోటిక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్నీంటికీ నవదీప్ సమాధానమిచ్చారని సునీతా రెడ్డి మీడియాకు వివరించారు. విచారణ అనంతరం నవదీప్ ఫోన్ సీజ్ చేశామని.. అయితే ఫోన్ లోని డేటాను డిలీట్ చేసి ఉందని ఆమె చెప్పారు. ఫోన్ రిట్రైవ్ చేసిన తరువాత నవదీప్ ను మరోసారి విచారణకు పిలుస్తామని ఎస్పీ తెలిపారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. మాదాపూర్ కేంద్రంగా డ్రగ్స్ ను విక్రయించే రాంచందర్ తో నవదీప్ కు ఉన్న పరిచయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అన్నీ ఆధారాలు సేకరించిన తరువాత మరిన్నీ అరెస్ట్ లు జరుగుతాయని ఎస్పీ సునీతారెడ్డి పేర్కొన్నారు. కాల్ డేటా.., వాటప్స్ చాటింగ్ ఆధారంగా డ్రగ్ కేసులో ఇన్వాల్ అయిన వారిని గుర్తిస్తున్నట్లు సమాచారం.సెప్టెంబర్ 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులు టాలీవుడ్ కు చెందిన దర్శకుడు సుశాంత్ రెడ్డి తోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నైజీరియన్స్ కూడా ఉన్నారు.