నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ గణపతి..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా గణపతిగా పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహా గణేషుడు నిమజ్జనానికి గురువారం తరలాడు.

ఉత్సవ కమిటీ సభ్యులు మహాగణపతిని ఇప్పటికే వాహనం పై ఎక్కించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గురువారం భాగ్యనగరం లో జరగనున్న నిమజ్జన కేంద్రాల వద్ద కూడా సిబ్బందిని సిద్ధం చేసింది కేసీఆర్ ప్రభుత్వం.  పవిత్ర నిమజ్జనోత్సవానికి అశేషంగా తరలివస్తున్న వినాయకుని ప్రతిమల వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల వద్ద యంత్రాలు.., సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

దాదాపు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పోలీసులు.., 20,600 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్ఏఎఫ్, పారా మిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం, తాగునీరు వితరణ, ఇతర సేవా కార్యక్రమాల్లో పది వేలకు పైగా జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది పాల్గొననున్నారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ వద్ద 70 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని.. ఈ కార్యక్రమానికి వీక్షించేందుకు 4 లక్ష మంది భక్తులు విచ్చేస్తారని అంచన వేస్తున్నారు. ఇప్పటికే 36 క్రేన్లు, వంద మంది గజ ఈతగాళ్ళు.., మూడు పడవలు.., 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అందుబాటులో ఉన్నారు.