పాదయాత్రకు సర్వసిద్ధం..!షెడ్యూల్ షురూ..!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరిగి ప్రారంభంకానున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజోల్ నియోజకవర్గం, పొదలాడలో సెప్టెంబర్ 10 నుంచి నిలిచిపోయిన పాదయాత్ర.. తిరిగి ప్రారంభిస్తున్నట్లు లోకేస్ ఆదివారం ప్రకటించారు. దీనిపై ఢిల్లీ నుంచి ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించిన ఆయన..తన పాదయాత్రను పున:ప్రారంభంపై ప్రస్తావించారు. పాదయాత్రను వచ్చేవారంలో ప్రారంభించి.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ.., నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరకలు రుద్దలేరని లోకేష్ అభిప్రాయపడ్డారు. అలానే చంద్రబాబును జైలు నుంచి బయటకు తెచ్చేందకు నారా లోకేష్ ఢిల్లీలో విశ్వప్రయత్నం చేస్తున్నారు. నిత్యం అక్కడు న్యాయవాదులతో లీగల్ సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు జాతీయ మీడియాలో చర్చల్లో పాల్గొని ఏపీలో జరుగుతున్న రాజకీయ అనిచ్ఛితిని వివరిస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ జాతీయ మీడియాకు వివరిస్తున్నారు. జాతీయ మీడియాతోపాటు జాతీయ పార్టీలను సైతం లోకేష్ కలిసి చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. స్పందిస్తున్న నేతలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు.

మొత్తంగా చంద్రబాబు అరెస్ట్  తరువాత నిలిచిపోయిన లోకేష్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ సీనియర్లు కూడా చంద్రబాబు అరెస్ట్ తో యాక్టీవ్ అయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని ప్రజల్లో బలంగా తీసుకుపోయేందుకే ఈ సారి యువగళం పాదయాత్ర పూర్తిగా సాగనున్నట్లు తెలుస్తోంది.