పోరుగడ్డపై కాంగ్రెస్ జెండా..!

తెలంగాణలోగెలుపే లక్ష్యంగాకాంగ్రెస్ అడుగులు వేస్తుంది.ఈ క్రమంలోశనివారంహైదరాబాద్ కేంద్రంగాజరుగుతున్నసిడబ్ల్యూసిసమావేశం కీలకంగా మారనున్నది.

ఏఐసీసీకి  జాతీయ అధ్యక్షుడైన  మల్లికార్జున కార్గే అధ్యక్షతన  జరగనున్న తొలి  సమావేశం  హైదరాబాద్ వేదికైంది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు.., నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..,  84 మంది  ముఖ్య నేతలు  హాజరవుతున్నారు. 

 కొన్ని నెలల్లో  ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  అనుసరించాల్సిన వ్యూహాలు..,  ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎజెండాలను చర్చిస్తారు. అలానే   జమిలి ఎన్నికల బిల్లు తెస్తే  అందుకు తగ్గ  అనుసరించాల్సిన వ్యూహాలను  ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది.  మరోవైపు తెలంగాణలో కూడా బిజెపి,  బీఆర్ఎస్ పార్టీలను దీటుగా ఎదుర్కొని  కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొచ్చే విధంగా  ఎత్తుగడలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది.  ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  తెలంగాణలో నిర్వహించాల్సిన బహిరంగ సభలు, పార్టీలో చేరే సీనియర్ కు సీట్లు.., వారికి సముచిత స్థానం వంటి వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఎన్నికల ఎజెండా..,  మేనిఫెస్టోలపై  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

జెమినీ ఎన్నికలు కానీ..,  మినీ జెమినీ ఎన్నికలను  ప్రకటిస్తే  అనుసరించాల్సిన వ్యూహాలను .., పార్లమెంట్ లో నినదించాల్సిన ప్రజా సమస్యలు.., మణిపూర్ అల్లర్లు , విదేశీ విధానం, ఇండియా కూటమీ పై కూడా చర్చించేలా సమావేశంలో ఎజెండాలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణ బలోపేతంతోపాటు..చత్తీస్గడ్.., రాజస్థాన్.., మణిపూర్.., మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.