బాంబు పేల్చిన మంత్రి అంబటి..!

ఇక కష్టమే..!ఏపీ జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు బాంబు పేల్చాడు. దీంతో రైతులు దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు.బాంబు పేల్చిన మంత్రి అంబటి.. ఇక కష్టమే..!

ఏపీలో కరువు విలాయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీరు వస్తుందని ఆశాభావంతో   ప్రత్తి.., మిరపా.., కంది.. ఆపరాలకు సంబంధించి పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో వరుణుడు మోహం చాటెయ్యడంతో వేసిన పంట ఎండిపోతోంది.

ఎగువ నుంచి కూడా వర్షలు లేక నాగార్జున సాగర్ ఒట్టిపోతోంది.  ప్రాజెక్ట్ లో నీటి మట్టం 20 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దీంతో రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ చివరకు వచ్చినా.. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈ ఏడాది కరువు తప్పదన్న భావనలో రైతులు ఉన్నారు.

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటకు నీరు ఇవ్వలేమని మంగళవారం మంత్రి అంబటి తేల్చి చెప్పాడు. మంత్రి స్టెట్మెంట్ తో పల్నాడు రైతులు పంటలపై పెట్టుకుని  ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతానికి పల్నాడు దాహార్తిని తీర్చేందుకు 5 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం అధికారులు విడుదల చేస్తున్నారు.

మంత్రి అంబటి కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కృష్ణా జలాల వాటను పక్క రాష్ట్రాలకు దోచిపెడుతూ.. ఏపీ రైతులను.., ప్రజలను నిలువున వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.