బాలయ్య ఫైర్.. అంబటి రారా..చూసుకుందాం..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం హాట్ హాట్ గా సాగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయాలంటూ టిడిపి సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టిడిపి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. అంబటి రాంబాబు వ్యాఖ్యలకు టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఘాటుగా స్పందించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి క్షణం నుంచే చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చ జరపాలని టిడిపి పట్టు పట్టింది. స్పీకర్ అనుమతించకపోవడంతో పోడియం ను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. టిడిపి ఎమ్మెల్యేలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ కూడా మద్దతు ప్రకటించారు.

ఈ క్రమంలో సభలో మంత్రి అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ మీసం తిప్పుతున్నాడని .. అలాంటి కార్యక్రమాలు సభలో కాదు సినిమాల్లో పెట్టుకోవాలని అంబటి ఎద్దేవా చేశారు. మీసం తిప్పడం కాదురా తొడ కూడా కొడతానని చెప్పి అసెంబ్లీలో బాలకృష్ణ తొడ కొట్టారు. దీంతో అంబటి బాలకృష్ణ ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రారా చూసుకుందాం అంటూ గట్టిగా బాలకృష్ణ కేకలు వేయడంతో.. అంబటి రాంబాబు అంబటి రాంబాబు కూడా అదే తీరులో స్పందించారు. నీవు రా.. చూసుకుందాం.. రా చూసుకుందాం అంటూ బాలకృష్ణకు సవాల్ విసిరారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి, మంత్రి మెరుగ నాగర్జున లు కూడా టిడిపి ఎమ్మెల్యేలపై దూసుకుపోయారు. దీంతో సభ ఆర్డర్ లో లేదని స్పీకర్ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు.