బిగ్ బ్రేకింగ్..బీఆర్ఎస్ కు మైనంపల్లి గుడ్ బై..!

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ గుడ్ బై చెప్పాడు. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వలేదని అలకపూనారు మైనంపల్లి. పార్టీకి రాజీనామ చేశారు.

మెదక్ టికెట్ ను తన కుమారుడికి ఇవ్వలేదని.. దానికి మంత్రి హరీశ్ రావు అడ్డుపడుతున్నాడని భావించి.. పార్టీపై.., కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో దూషించారు మైనంపల్లి. ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తెరవెనుక జరిగే రాజకీయాలను ఎండగడుతూ వస్తున్నారు. అయితే శుక్రవారం షడన్ గా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ ఎమ్మెల్యేల అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. అందులో మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకే టికెట్ కేటాయించారు.

ఈ క్రమంలో మెదక్ టికెట్ కుమారుడు మైనంపల్లి రోహిత్ కు ఇస్తేనే తాను పోటీ చేస్తానని.. లేకుంటే లేదు అని తెగేసి చెప్పాడు మైనంపల్లి. గతంలో మెదక్ లో ప్రాతినిథ్యం వహించిన మైనంపల్లి 2014 నుంచి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. 2018 మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అయితే పార్టీలో హరీశ్ రావు పెత్తనం ఎక్కవైందని.. దాదాపు వేల కోట్లు పార్టీని అడ్డంపెట్టుకుని సంపాదించాడని బహిరంగ ఆరోపణలు చేశారు మైనంపల్లి. ఇదిలా ఉండగా..  ఒక దశలో కేసీఆర్ కూడా కలగజేసుకుని మల్కాజిగిరి టికెట్ మైనంపల్లికి  కేటాయించనని.. పోటీ చేయడం.. చేయకపోవడం ఆయన ఇష్టమని చెప్పడం మైనంపల్లి ఎపిసోడ్ లో చెప్పుకోతగ్గ అంశం.   అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మైనంపల్లి ఏ పార్టీలో చేరబోతున్నారో తెలియరావాల్సి ఉంది.