బిచ్చగాడు సినిమా హీరో ఇంట తీవ్ర విషాదం..!

నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన  కుమార్తె మీరా అంటోనీ ఆత్మహత్య చేసుకొని  మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది.

 బిచ్చగాడు ప్రేమ్  హీరో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆయన కుమార్తె  మీరా అంటోనీ  ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని  డిడికె రోడ్డులోని తన నివాసంలో  ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పదహారేళ్ళ మీరా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతుంది.  అయితే ఆమె ఆత్మహత్యకు  గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మీరా  ఆత్మహత్య నేపథ్యంలో  పలువు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.