సుప్రీంకోర్టు లో పిటిష‌న్‌ – బిల్కిస్ బానో` దోషుల విడుద‌ల‌పై – bilkis bano case convicts release challenged in sc cji to consider listing it

Bilkis Bano Case: 2002 గుజ‌రాత్ అల్ల‌ర్లు..

2002లో గోద్రా రైలు ద‌హ‌నం అనంత‌రం గుజ‌రాత్‌లో చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో బిల్కిస్ బానో కుటుంబం దారుణంగా న‌ష్ట‌పోయింది. త‌మ‌పై దాడిని త‌ప్పించుకునేందుకు పంట పొలాల్లో దాక్కున్న బిల్కిస్ బానో కుటుంబ స‌భ్యుల‌ను వెంటాడి మ‌రీ చంపేశారు. ఆ దుండ‌గులు చంపేసిన వారిలో బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఐదు నెల‌ల గ‌ర్భిణి ఐన బిల్కిస్ బానోను దారుణంగా సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ త‌రువాత ఆమె కూడా చ‌నిపోయింద‌ని భావించి, అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. సీబీఐ ద‌ర్యాప్తు అనంత‌రం దోషుల‌కు శిక్ష ప‌డింది. వారిని తాజాగా గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వారికి అహ్మ‌దాబాద్‌లోని వీహెచ్‌పీ ఆఫీస్‌లో సన్మానం కూడా చేశారు.