బీఆర్ఎస్ లో కొత్తరాగం.. తెలుగు దేశంతో దోస్త్ మేరా దోస్త్..!

చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాపంగా రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీ సైతం అనివార్య మార్పులతో కొత్తరాగం అందుకోక తప్పలేదు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు బాగా ఊపందుకున్నారు. వైసీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంటే.. కాంగ్రెస్.., బీజేపీ నేతలైతే బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని బీఆర్ఎస్ నేతల్లో కొందరూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. హైదరాబాద్ వేదికగా ఐటీ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. దాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఏపీకి వెళ్ళి మీ నిరసనలు అక్కడ వ్యక్తం చేయాలని సూచించారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వారి ఓట్లు అయితే కావాలే గానీ.., ఇక్కడ మాకు నిరసన వ్యక్తం చేసే స్వేచ్చ లేదా అంటూ సోషల్ మీడియా కేంద్రంగా నినదించారు. వచ్చే ఎన్నికల్లో మా ఓట్లు నీకు అక్కర్లేదా ..? అని ప్రశ్నించారు.

దీంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. దిట్టుబాటు చర్యలకు ఖమ్మం వేదికైంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కేటీఆర్ అమాంతం పైకిత్తి.. మొక్కాల్సి వచ్చింది.  ఖమ్మం లోని లకారం సెంటర్లో 40 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటుకు మంత్రి పువ్వాడ, తానా సభ్యులు కృషి చేశారు. విగ్రహం నిర్మాణం.., ఏర్పాటు చేయాలని ప్లానింగ్స్ మొత్తం ముగిసిన తరువాత కొందరూ కోర్టు తలుపులు తట్టారు. దీంతో కొంత బ్రేక్ పడింది. ఈ విగ్రహాన్ని అవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ కు ముందు ఆహ్వానించారు. కానీ అనూహ్యంగా అసలు షెడ్యూల్లోని లేని ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష్యమయ్యారు.   

ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే ఖమ్మం.., భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తెలుగు దేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటర్లును ఆకర్షించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ.., వైసీపీ లకు పెద్ద దెబ్బే. ఏపీలో ప్రత్యక్ష్యంగా వైసీపీకి ఓటర్లు దూరం అవుతుంటే.. తెలంగాణలో హైదరాబాద్ తోపాటు.., ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ వచ్చేలా కనిపిస్తోంది. అంతేకాక తెలంగాణలో టీడీపీ కేడర్ సైతం ఆందోళన బాట పట్టింది. స్లిపర్ సెల్స్ లా ఉన్న తెలుగు దేశం సానుభూతి.. క్రమేపి రోడ్డెక్కి చంద్రబాబుకు మద్దతు తెలుపుతోంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చూపనున్నది. మరోవైపు తెలుగు దేశం కూడా తెలంగాణలో పోటీకి సై అంటుంది. అలా దిగితే ఇక బీఆర్ఎస్ పరిస్ధితి కొంచెం అటు ఇటు కాక తప్పదని సర్వేలు ఊపందుకున్నాయి. వీటిని గ్రహించిన కేసీఆర్ అండ్ టీం.. దిద్దుబాటుకు ఉపక్రమిస్తున్నారు. అందులో భాగమే షెడ్యూల్లో లేని ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహం కేటీఆర్ అవిష్కరణ.., పిలువ పేరంటానికి వెళ్లి..  తెలుగు దేశం పార్టీని అమాంతం ఆకాశానికి ఎత్తి.. మొక్కిన పరిస్ధితి..అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఎన్టీఆర్‌ శిష్యుడైన తన తండ్రి కేసీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రి అయితే ఆ ఘనతను దివంగత ఎన్టీఆర్‌ ఆశీర్వాదమే అని ప్రశంసించారు. అంతేకాక ఎన్టీఆర్ పేరులోనే పవర్ ఉందని.. ఆ పేరు నాన్న తనకు పెట్టారని కీర్తించారు. ఇలా ఎన్టీఆర్ ను.., ఆ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పొగడ్తలతో ముంచారు.

ఇలా మొత్తంగా కేటీఆర్ వ్యూహం ఖమ్మంలో వర్కౌంట్ అయ్యింది. మరో వైపు ఖమ్మంలో సీనియర్ల విముఖత.., కండవాలు మార్చడం వంటి చర్యలకు బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ పడుతోందని చెబుతున్న సర్వేలను గ్రహించే వాటిని కప్పిపుచ్చే కలరింగ్ లో భాగమే కేటీఆర్ తన అహాన్ని సైతం పక్కనపెట్టి పిలువని పేరంటాని వచ్చి.. ఎన్టీఆర్ ను తలకెత్తుకున్నారని విమర్శలు ఖమ్మం ఖిల్లాలో ప్రతిధ్వనిస్తున్నాయి.