మోత్కుపల్లి మాట్లాడుతున్నాడు..వెనుకున్న మర్మం అదేనా..?

తెలుగు రాష్ట్రాల్లో నిన్న మోత్కుపల్లి నర్సింహులు చేసిన పొలిటికల్ కామెంట్సే మీడియాలో హెడ్ లైన్స్ గా నిలిచాయి.

సీనియర్ బీఆర్ఎస్ నేత.., మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు అరెస్ట్ పై సంచలన కామెంట్స్  చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తారు. ఓసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని దళిత సంఘాలకు పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. నేడు జగన్ పై ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయాల్లో వర్గాలు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు. దీనిపై కేసీఆర్ కూడా స్పందించాలని కోరారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ నడుస్తోంది. మరోవైపు నారా లోకేష్ కూడా ఢిల్లీ కేంద్రంగా మకాం వేసి మరి.. మేధావులతో మాట్టాడిస్తున్నారు. అలానే వివిధ పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారు. మరో వైపు రాజకీయంగా  బద్ధశత్రువులుగా మారిన కేసీఆర్ పార్టీ మంత్రులు.., ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి.., స్పీకర్ పోచారం తదితరులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. నిన్న మోత్కుపల్లి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి ఒక అడుగు మందుకు వేసి జగన్ ను పరుషపదజాలంతో నానా మాటాలతో దూషించారు. నోటికి పట్టరాని విధంగా విమర్శించారు. ఒక దశలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడలేదు. ఇలా మోత్కుపల్లి జగన్ పై చేసిన విమర్శలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ రాజకీయ అస్త్రాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు దేశం కు కొంత ఓటు బ్యాంకు ఉంది. గెలిచే ఓటు బ్యాంకు లేనప్పటికీ ఒక అభ్యర్ధిని ఓడించే శక్తి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉంది అన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న నేతలందరూ నేడు చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతున్నారని.., సంఘీభావం తెలుపుతున్నారని రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపధ్యంలో మోత్కుపల్లి కూడా మాట్లాడుతున్నారని విమర్శలు లేకపోలేదు.