రిలీజ్ కు ముందే టీఎన్ఆర్ తడఖా..!

రిలీజ్ కు ముందే టైగర్ నాగేశ్వరరావు సినిమా అంచనాలకు మించి వ్యాపారం చేస్తోంది. రవితేజ కేరియర్ లో మరో బ్లాక్ బ్లాస్టర్ ను సొంత చేసుకునేలా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం సిని సర్కిల్స్  మాంచి బజ్ క్రియేట్ చేస్తోంది. దీంతోపాటు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ యాడ్ అవ్వడంతో రికార్డ్ స్థాయిలో బిజినెస్ ను చేస్తున్నారు మేకర్స్.

శాటిలైట్ రైట్స్ కాకుండానే నాన్ థియెట్రికల్ హక్కులు 49 కోట్లకు అమ్ముడుబోగా.. తెలుగు రాష్ట్రాల హక్కులు 30 కోట్లు.., నైజా రైట్స్ అడ్వాన్స్ బేస్ గా థియేటర్లో విడుదల కానున్నది ఈ చిత్రం. అయితే చిత్రం విడుదలకు ముందు ఇంతలా వసూళ్ళు సాధించడంతో బ్లాక్ బ్లాస్టర్ ఖాయమని అందరూ భావిస్తున్నారు.  దసరా బరిలో నిలిచే ఈ చిత్రం అక్టోబరు 20న విడుదల కానున్నది. అయితే ఈ డేట్ మారే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాతో ప్రచారం ఊపందుకుంది.

ఏదీఏమైనా స్టూవర్ట్ పురం గజదొంగ పేరుతో చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ లుక్ మాస్ గా ఉన్నాడు. పాత్రలో ఇమిడి పోయేలా చిత్రీకరించిన సన్నివేశాలు ట్రైలర్ లో రచ్చ చేస్తున్నాయి. ట్రైలర్ లో వినిపించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.., కనిపించే రవితేజ మాస్ లుక్ మొత్తంగా ఎక్స్ ట్రార్డనరీ అనే చెప్పాలి. అయితే ట్రైలర్ చూస్తే సినిమా ఫ్యూచర్ చెప్పే క్రిటిక్స్ సినిమా అంచనాలను పెంచారు. దీంతో  ఒక్కసారిగా సినిమా రేంజ్ అమాంతం పెరిగి మాంచి బిజినెస్ ను రాబట్టుతోందని విశ్లేషణలు ఊపందుకున్నాయి.