లోకేష్ అరెస్ట్ .. వైసీపీ వర్సెస్ టీడీపీ..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడునారా లోకేష్మరికొద్ది గంటల్లో అరెస్టు కాబోతున్నాడన్న వార్తలు వైసిపిసోషల్ మీడియాలోహల్చల్ చేస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం  ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా  వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది.  చంద్రబాబు అరెస్టు  అక్రమ అరెస్టు అని తెలుగుదేశం పార్టీ  పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.   మరోవైపు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వీరి విమర్శలను సైతం టీడీపీ తిప్పికొడుతోంది. ఆధారం లేకుండా  స్కిల్ డెవలప్మెంట్ కేసులో  చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు అని  తెలుగుదేశం పార్టీ  ఆరోపిస్తుంటే ..  పూర్తి ఆధారాలతోనే  పక్కాగా అరెస్ట్ చేశారని మరోవైపు వైసీపీ  బలంగా వాదిస్తుంది 

 ఈ క్రమంలో నారా లోకేష్ అరెస్టు అవుతాడని  సోషల్ మీడియా కేంద్రంగా  ఒక వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్  గత నాలుగు రోజులుగా  ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  అక్కడ పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో  తెలుగుదేశం పార్టీ ఎంపీలకు  సభలో వ్యవహరించాల్సిన అంశాలపై  దిశా నిర్దేశం చేశారు  లోకేష్.  అలానే అక్కడ ఉన్న జాతీయ మీడియాకు  ముఖాముఖీలు.., నిర్వహించే  స్పెషల్ లైవ్ డిబేట్స్ కు హాజరై  ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న  రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు లోకేష్. దీంతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి  అరెస్టు చేశారన్న విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నంలో లోకేష్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు.ఫైబర్ గ్రిడ్  కేసును సీఐడీ తెరపైకి తీసుకొస్తున్నాయి. ఈక్రమంలో లోకేష్ అరెస్టు అవుతాడన్నది అందుతున్న సమాచారం.  అందుకే లోకేష్ ఢిల్లీ ప్రయాణం అయ్యాడని అక్కడి నుంచి తన అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు  రాగానే లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు  సిఐడి  అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారని  వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో  ఒక దశలో   దాదాపు లోకేష్ అరెస్టు అనివార్యమే  అన్నట్లు అందరూ  ఊహించినా..  ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో లొకేష్ ను  కూడా అరెస్టు చేస్తే  రాష్ట్రం తగలబడుతుందని టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.