వరికపూడిశెల@చెల్లికి మళ్లీ పెళ్లి సామెతేగా..?

జగన్ రెడ్డి ఈ నాలుగునరేళ్ళల్లో చేసింది ఏమీ లేకపోయినా మాజీ ముఖ్య మంత్రులు చేసిన ప్రాజెక్టులకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ అబాసుపాలౌతున్నారు.

ఏపీలో గతంలో ఎన్నడూ లేని వింత పరిపాలనను ప్రజలు చూస్తున్నారు. సంప్రాదాయ రాజకీయాలను గోదావరిలో కలిపి..  సైకో రాజకీయాలకు తెరతీస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. విశాఖ భోగపురం విమానాశ్రయం, ఆదానీ డేటా సెంటర్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్ధాపన చేశారు. దానికి తిరిగి జగన్ రెడ్డి మే 03, 2023 లో తరువాత శంకుస్థాపన చేశారు. అంతేకాక జగన్ సొంత జిల్లా కడపలో వైఎస్ఆర్ హయంలో 2007, జూన్ 10న బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అది కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆ తరువాత 2018లో డిసెంబరు 27న రాయలసీమ  స్టీలు ఆథారిటీ కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారు. అయితే ప్రభుత్వమే ఈ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అదీ కుదర్లేదు.

జగన్ హయంలో 2019 డిసెంబర్ 23న ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో జగన్ తిరిగి శంకుస్థాపన చేశారు. కానీ అది ఎందుకో బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ ఏడాది ఫ్రిబవరి 15న జేఎస్ డబ్ల్యూ పేరుతో జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇలా కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె,పెద్ద దండ్లూరు గ్రామం వద్ద  ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ కు జగన్ రెండు స్లార్లు, అంతకు ముందు దివంగత వైఎస్ఆర్, చంద్రబాబు చెరొకసారి శంకుస్థాపన చేశారు.

ఈ నేపధ్యంలో అదే సాంప్రాదాయాన్ని పల్నాడు లో జగన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని వెల్దూర్తి మండలం, వరికిపూడ శెల ఎత్తిపోతల పథకానికి జగన్ రెడ్డి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ నెల 15న వరికపూడిశెలకు ముచ్చటగా మూడోవసారి జగన్ శంకుస్ధాపన చేయడానికి సమాయక్తమవుతున్నారు. వెల్దూర్తి మండలం గంగలకుంట వద్దనున్న వరికపూడి వాగుకు సాగర్ బ్యాక్ వాటర్ ను  ఎత్తిపోసే డిజైన్ చేస్తున్న పథకమే ఈ వరికపూడిశెల. సాగర్ జలాశయం బ్యాక్ వాటర్ ను ఎత్తిపోసి.. వెల్దూర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, గురజాల, బొల్లాపల్లి మండలాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే పథకం లక్ష్యం. దాదాపు ఒక లక్ష , 30 వేల ఎకరాలకు తొలిదశలో సాగునీరు అందించే బృహత్తర ప్రాజెక్ట్ కు గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు లు శంకుస్ధాపన చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం 2019 ఫిబ్రవరి లో 340 కోట్లను కూడా మంజూరు చేసింది. తొలిదశ పనులకు కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ 298 కోట్లకు టెండరును దక్కించుకుంది. అటవీశాఖ అనుమతుల కోసం కొంత జాప్యం జరగడం, మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రావడం వంటి అవంతరాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఫారెస్ట్ శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ ప్రాజెక్ట్ కు సీఎం జగన్ రెడ్డి ఈ నెల (నవంబర్)15 న శంకుస్ధాపన చేసేందుకు మాచర్లకు వస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు శంకుస్ధాపన చేసినా వరికపూడిశెలకు జగన్ రెడ్డి ఎన్నికలు రెండు, మూడు నెలలు ముందు హడావుడిగా శంకుస్ధాపన చేయడం ఏమిటని..? పల్నాడు, ప్రకాశం జిల్లాల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఏదో సినిమాలో చెల్లికి చేయాలి మళ్లీ మళ్లీ పెళ్ళి అన్నమాదిరిగా ఉందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.