వారాహి వార్ ఫిక్స్.. 1 నుంచి యుద్థమే..!

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర డేట్ ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు.

ఉమ్మడి కృష్ణ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన నాలుగొవ విడత వారాహి యాత్ర అక్టోబర్ 01 నుంచి ప్రారంభిస్తారని ఆపార్టీ నాయకులు నాదేండ్ల చెప్పారు. దీనికి సంబంధిచిన షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు. జిల్లాలోని ముందుగా అవనిగడ్డ నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానున్నది. యాత్రలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పవన్ బహిరంగ సభ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

దాదాపు ఐదు రోజులుపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగనున్న జనసేనాని యాత్రకు పార్టీ శ్రేణులతోపాటు తెలుగు దేశం పార్టీ నాయకులు.., కార్యకర్తలకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అయితే నాలుగొవ విడుత వారాహి యాత్రకు ప్రత్యేక ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ పొత్తును ప్రకటించడం.. పొత్తు తరువాత నిర్వహిస్తున్న ఈ యాత్రకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం.., జనసేన నేతలు.., కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని అంచనాలున్నాయి.

ఈ యాత్రలో భాగంగా ముందు అవనిగడ్డను ముగించుకుని మచిలీపట్నం చేరుతారు. ఆ తరువాత 2,3 తేదీల్లో అక్కడే ఉండి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. యువతతో ప్రత్యేక కార్యక్రమాలు.., జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత మచిలీపట్నం నుంచి 4 వ తేదిన పెడన.., 5 వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.