వివేక హత్యకేసులో కీలక మలుపు..!

వివేక హత్య కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందుతుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కండిషనల్ విత్ ఎస్కార్ట్ తో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు..!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందుతుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి మెయిల్ ను సిబిఐ కోర్టు మంజూరు చేసింది. ఆయనకు 12 రోజుల మధ్యంతర బెల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎస్కార్ట్ వాహనంలోనే భాస్కర్ రెడ్డిని తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఎక్కడుకు వెళ్లినా నిత్యం బందోబస్తులో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నుంచి నుంచి అక్టోబర్ 3 వరకు వైయస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ గడువును ఇచ్చింది. నిజానికి 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించినా.. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం రీత్య 12 రోజులు మాత్రమే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

అయితే ఈ కేసుల అరెస్ట్ అయిన నాటి నుంచి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదు. బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు సీబీఐ, హై కోర్టులను ఆయన అభ్యర్ధించారు. కానీ ఇరు కోర్టులు స్పందించలేదు. దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదనల తర్వాతే ఈ బెల్ ను మంజూరు చేసింది. హెల్త్ రిపోర్టును పరిశీలించిన తర్వాత 12 రోజులపాటు ఈ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ సిబిఐ కోర్టు తీర్పును వెల్లడించిందనే చెప్పాలి. అయితే బెయిల్ కొన్ని కండీషన్ ను పెట్టింది కోర్టు. హైదరాబాద్ దాటి భాస్కర్ రెడ్డి వెళ్లకూడదని.. పోలీసుల పర్యవేక్షణలోనే వైద్య చికిత్స తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ లో తన నివాసంలో కానీ.., లేదా హైదరాబాద్ లో ఇళ్ళు తీసుకుని ఉండాలే తప్పా.. హైదరాబాద్ దాటి వెళ్లడానికి వీలు లేదంటూ స్పష్టం చేసింది కోర్టు. అక్టోబర్ 3వ తేదిన ముగియగానే కేటాయించిన ఎస్కార్ట్ వాహనంలో తిరిగి చంచల్ గూడ జైలుకు రావాలని ఆదేశించింది.