ఏపీ సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి అందుకున్న నినాదంపై కట్టుబడి ఉన్నారు. ఆయన రాగంలో ఎటువంటి మార్పులేదు. అందుకే ఎన్నికలు రేపు జరుగుతాయన్నా.. వై నాట్ 175 అంటూనే పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూనే ఉంటారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి అందుకున్న నినాదంపై కట్టుబడి ఉన్నారు. ఆయన రాగంలో ఎటువంటి మార్పులేదు. అందుకే ఎన్నికలు రేపు జరుగుతాయన్నా.. వై నాట్ 175 అంటూనే పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూనే ఉంటారు. ఈ నేపధ్యంలో తాడిపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై మంగళవారం ఆయన సమీక్షించారు. యాక్టీవ్ గా లేని ఎమ్మెల్యేలు.., మంత్రులు జాబితాను సేకరించి.. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయ్.. వాటిని ఎలా సరి చేసుకోవాలని దిశ నిర్థేశం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఎమ్మెల్యేల పనితీరును వివరించి.. ప్రజల్లో వారికున్న ఇమేజ్ ను బట్టబయలు చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.., ఆ తరువాత ఇన్నిరింగ్ రోడ్డు అలైన్మెంట్,పవర్ గిడ్ కేసుల్లో జారీ చేసిన పీటి వారెంట్లపై జగన్ ప్రభుత్వం దృష్టిసారించింది. మరో వైపు తెలుగుదేశం కూడా దిశానిర్ధేశం చేసే వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు.. ఆ తరువాత వాట్ నెక్స్ట్ అంటూ డైలమాలో పడ్డారు. మరోవైపు అరెస్ట్ కు భయపడి లోకేష్ ఢిల్లీలో దాక్కున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై బెయిల్ ఎప్పుడు వస్తుందో ఆ పార్టీ శ్రేణులకు క్లారిటీ రావడంలేదు. ఈ క్రమంలోనే దారి తప్పిన పార్టీ ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు జగన్ వరుస కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి తిరిగి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యేలకు దిశనిర్ధేశం చేస్తున్నారు జగన్. అలానే జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

గతంలో పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై.. పార్టీని అగ్రపథంలో నిలబెట్టాడు జగన్. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ జెండాను ఎగరవేసిన జగన్ .. అదే జోష్ ను వచ్చే ఎన్నికల్లో కనపర్చి పార్టీని రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు అన్నీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పని చేయని ఎమ్మెల్యేలను.., పార్టీ ఉపయోగంలేని నేతలను పక్కన పెట్టి.. ఆ స్థానంలో కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ లను సవరించి.. పార్టీని ఫుల్ యాక్టీవ్ స్వింగ్ లో తీసుకొచ్చేందుకు జగన్ అన్నీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.