శివపార్వతులుగా నయనతార ప్రభాస్..!భారీ బడ్జెట్ చిత్రం..!

టాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది. మంచు ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది. మంచు ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం భక్త కన్నప్ప ను ఎట్టకేలకు సెట్ పైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ సాధించిన మహాభారతం సిరీస్ దర్శకులు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారని మంచు విష్ణు తాజాగా ప్రకటించారు.

విష్ణు ప్రకటనలతో ఈ చిత్రానికి మరింత బజ్ పెరిగింది. అయితే పార్వతి పాత్రలో ఎవరు నటిస్తారని చర్చ కొంత కాలంగా సాగుతుంది. అయితే మొదట్లో ఈ పాత్రకు బాలీవుడ్ నుంచి ఎంపిక చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే అలా కాదని పార్వతి పాత్రకు నయనతార సరిగ్గా సరిపోతోందని కొన్ని సూచనలను దర్శకుడు తీసుకొచ్చారంట. కానీ మంచు విష్ణు మాత్రం దీనిపై నేటికీ క్లారిటీ ఇవ్వలేదు.దీనిని మాత్రం చిత్రంలో నటించే ఓ సీనియర్ నటి మాత్రం ఇప్పటికే వెల్లడించారు.

ఈ మధ్య ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్ర పోషించి.. ప్రభాస్ మొప్పించారు. ఈ నేపథ్యంలో దేవుళ్ళ పాత్రకు ప్రభాస్ బాగా సెట్ అవుతాడని మేకర్స్ కు కాన్ఫిడెంట్ ను ఇస్తున్నారు. బాహుబలి నుంచే ప్యాన్ ఇండియా హీరో గా ఘనత సాధించిన ప్రభాస్.. ఆదిపురుష్ చిత్రంతో దేవుళ్ళ పాత్రకు కూడా బాగా సెట్ అవుతాడని పేరు తెచ్చుకున్నారు.

మరోవైపు శ్రీరామ రాజ్యంలో నయన తార సీత పాత్ర పోషించి.. అలనాటి సీత పాత్రలో కనిపించిన అంజలిదేవిని తలపించేలా నటించింది. సీత పాత్రలో ఇమిడిపోయి.. అచ్చం సీతదేవిలాగే కనిపించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్, నయన లు పార్వతీ, పరమేశ్వరుడి సరిగ్గా సరిపోతారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతున్నాయి. దీంతో పార్వతి పాత్రకు నయన తారే కరెక్ట్ అని వార్త సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. 2007 లో ప్రభాస్, నయన తార కాంబినేషన్ లో యోగి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సిల్వర్ స్కిన్ పై పండుతుందని అందరికీ తెలిసిందే.