షర్మిల దెబ్బకు కాంగ్రెస్ షేకవ్వాల్సిందేనా..?

వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల రాజకీయ వ్యూహానికి చిత్తు అయ్యేది కాంగ్రెస్ పార్టీనే అన్నది గ్రహించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

తెలంగాణ గడ్డపై తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన షర్మిల కేరియర్ అంతా ముళ్ళబాట ప్రయాణంలా మాదిరిగానే ఉంది. యువతకు ఉపాధి అంశాలపై నిరసనలు.., కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై యుద్ధభేరి ప్రకటించి మరి పాదయాత్రలు చేసింది షర్మిల. అన్న జగన్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకున్నా..తెలంగాణలో తండ్రి వైఎస్ఆర్ ఫాలోవర్స్ తో తన రాజకీయ ప్రయాణం సాగించిన షర్మిల.. ఆది నుంచే తన సొంతపార్టీ వైఎస్ఆర్టీపీ లో మాంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఏమైందో కానీ.. తనకు కాంగ్రెస్ మకిలి అంటుకుంది. దీంతో పార్టీలో ఉన్న సీనియర్లు ఆమెను వదిలి దూరంగా జరుగుతున్నారు.

ఆ మధ్య షర్మిల కర్నాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్ తో భేటీ అనంతరం ఢిల్లీ ప్రయాణం షర్మిల పొలిటికల్ కేరియర్ కీలక మలుపుకు దారి తీసింది. ఢిల్లీలో సోనిమా.., రాహుల్ గాంధీ లతో ములాఖత్ అనంతరం షర్మిల కు ఫుల్ క్లారిటీ వచ్చింది. కాంగ్రెతో ప్రయాణం సాగించాలంటే వైఎస్ఆర్టీపీని వీలినం చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదనను సైతం ఒకే చెప్పిన ఆమెకు ఆదిలోనే హంసపాదులా మారింది. తనుకు ఇష్టంలేని ప్రపోజల్ ను కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చి.. కప్పదాటు వ్యూహానికి తెరతీసింది. ఇసుక నుంచి తైలం మాదిరిగా మారిన ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పగ్గాలను షర్మిలను చేపట్టాలని ఆదేశించింది. మరోవైపు కూడా జగన్ తన పావులను కాంగ్రెస్ వైపు కదపడంతో షర్మిల కాంగ్రెస్ ప్రయాణం బ్రేక్ పడింది.

ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అధిష్టానం నుంచి షర్మిలకు ఆహ్వానం రాలేదు. ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తానని చెప్పిన షర్మిల ప్రస్తుతం ఒంటరి కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపార్టీ సీనియర్ నాయకులు ఏపూరి సోమన్న షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ లోకి చేరారు.

నష్టనివారణలో భాగంగా షర్మిల లోటస్ ప్లాంట్ లో రాష్ట్ర కార్యవర్గ సమేవేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒంటరి పోరాటంలో భాగంగా కార్యచరణ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోందని సమాచారం. అలా జరిగితే బీఆర్ఎస్ నెత్తిన పాలుపోసినట్లేనని విశ్లేషణలు ఆ నాటివి కావు. ఉమ్మడి నల్గొండ..,ఖమ్మం జిల్లాలో దివంగత నేత వైఎస్ఆర్ అభిమానులు ఎక్కుగా ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుంది. ఆ పార్టీ నుంచి అభ్యర్ధులు గెలువకున్నా.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధులను కచ్చితంగా ఓడించేంతగా ఓట్లను చీల్చే శక్తి షర్మిల పార్టీకి ఉంది.

ఈ ప్రభావం కాంగ్రెస్ పైనే ఎక్కువగా చూపుతోందన్న సర్వేలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి మాటలతో గుడ్డిగా ముందుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి షర్మిల రూపంలో శరఘాతం తప్పదు అన్న కథనాలు తెరపైకి వస్తున్నాయి. తుంగతుర్తి.., కోదాడ.., హుజూర్ నగర్.., మిర్యాలగూడ.. పాలేరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీకి మంచి బలం ఉంది. ఇక్కడ ఆపార్టీకి తిరుగులేదని సర్వేలు చెప్తున్నాయి.